రెండు రోజుల్లో 10 ఆవులను చంపిన పెద్ద పులి
విధాత : ఓ పెద్ద పులి బీభత్సం సృష్టించింది. రెండు రోజుల్లోనే 10 ఆవులను చంపేసింది. ఈ ఘటన కేరళలోని మున్నార్ పరిధిలో వెలుగు చూసింది. న్యామక్కడ్ ఏరియాల్లో పెద్ద పులి సంచరిస్తుండటంతో.. దాని కదలికలను గమనించేందుకు స్థానికంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే శనివారం ఐదు ఆవులను, ఆదివారం మరో ఐదు ఆవులను పులి చంపేసింది. దీంతో స్థానికులు పెద్ద పులి కదలికలపై కన్నేసి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. మొత్తంగా ఆ […]
విధాత : ఓ పెద్ద పులి బీభత్సం సృష్టించింది. రెండు రోజుల్లోనే 10 ఆవులను చంపేసింది. ఈ ఘటన కేరళలోని మున్నార్ పరిధిలో వెలుగు చూసింది. న్యామక్కడ్ ఏరియాల్లో పెద్ద పులి సంచరిస్తుండటంతో.. దాని కదలికలను గమనించేందుకు స్థానికంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
అయితే శనివారం ఐదు ఆవులను, ఆదివారం మరో ఐదు ఆవులను పులి చంపేసింది. దీంతో స్థానికులు పెద్ద పులి కదలికలపై కన్నేసి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. మొత్తంగా ఆ పెద్ద పులిని స్థానికుల సహాయంతో అటవీ శాఖ అధికారులు బంధించారు. ఆవులను కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం కింద రూ. 35 వేల చొప్పున ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram