Viral Video | పెద్ద పులి.. తన కంట పడ్డ ఏ జంతువును కూడా వదిలిపెట్టదు. దాన్ని వేటాడి చంపేస్తుంది. అలాంటి పెద్దపులిని చూసి మిగతా జంతువులు కూడా పరారవుతాయి. కొన్ని సందర్భాల్లో పులికి చిక్కక తప్పదు. అయితే ఆ మాదిరి ఘటనే ఇది.
ఓ చెట్టుపై కోతి ఉంది. అదే చెట్టుపై పులి కూడా ఉంది. ఇక కోతిని వేటాడేందుకు పులి తీవ్రంగా ప్రయత్నించింది. కానీ కోతి తన తెలివి ప్రదర్శించి పులిని ముప్పుతిప్పలు పెట్టింది. కోతి తెలివికి పెద్దపులి తికమక అయింది. కోతి మరో కొమ్మపైకి ఎగరగానే, లాభం లేదనుకుని పులి చెట్టుపై నుంచి కిందకు దూకేసింది. కిందకు దూకిన తర్వాత కూడా పులి ఆ కోతి వైపు చూస్తూనే ఉండింది.
Viral Video | కోతి తెలివి.. తోకముడిచిన పెద్దపులి https://t.co/9NzctCIQqv pic.twitter.com/RAvuxui2As
— vidhaathanews (@vidhaathanews) December 12, 2022
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోతి తెలివికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పులి బారి నుంచి కోతి తప్పించుకున్న తీరును ప్రశంసిస్తున్నారు. కోతి సమయస్ఫూర్తి అద్భుతమంటూ కొనియాడుతున్నారు. శత్రువు నుంచి ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో ఈ వీడియోను చూసి నేర్చుకోవాలని మరికొందరు పేర్కొన్నారు.