Jupalli Krishna Rao: అన్ని ప్రశ్నలకు సమయమే సమాధానం చెబుతుంది: జూపల్లి

విధాత‌: బీఆర్‌ఎస్‌ వేటు వేసిన తర్వాత మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మొదటిసారి తన నియోజకవర్గం కొల్లాపూర్‌లో కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ కార్యక్రమంలో తన భవిష్యత్తను కార్యాచరణను ప్రకటిస్తానన్నారు. ఈ రోజు ముఖ్యకార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఇవాళ సమావేశం అనంతరం జూపల్లి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే విషయంపై ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో చర్చ జరుగుతున్నది. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ.. భవిష్యత్తు కార్యాచరణను కాల‌మే నిర్ణయిస్తుందన్నారు. […]

  • Publish Date - April 11, 2023 / 06:36 AM IST

విధాత‌: బీఆర్‌ఎస్‌ వేటు వేసిన తర్వాత మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మొదటిసారి తన నియోజకవర్గం కొల్లాపూర్‌లో కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ కార్యక్రమంలో తన భవిష్యత్తను కార్యాచరణను ప్రకటిస్తానన్నారు. ఈ రోజు ముఖ్యకార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఇవాళ సమావేశం అనంతరం జూపల్లి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే విషయంపై ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో చర్చ జరుగుతున్నది.

ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ.. భవిష్యత్తు కార్యాచరణను కాల‌మే నిర్ణయిస్తుందన్నారు. నిన్న మంత్రి నిరంజన్‌రెడ్డి తన మేధోశక్తినంతా ఉపయోగించిన గంటసేపు తన గురించి మాట్లాడారు. దానికి సవివరంగా సమాధానం ప్రెస్‌మీట్‌లో చెప్పబోతున్నట్టు తెలిపారు.

జూపల్లి మరికొందరితో కలిసి కొత్త పార్టీ పెట్టబోతున్నారనేది ఊహాగానాలే అన్నారు. తాను మంత్రిగా రాజీనామా చేసిన సందర్భంలోనూ వినాశకాలే విపరీతబుద్ధి అని కొందరు అన్నారు. మీ ప్రశ్నకు సమయం సమాధానం చెబుతుందని నేను ఆనాడే అన్నాను. ఆ సమయం వచ్చింది. సమాధానం చెప్పాం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాబట్టి ప్రస్తుత పరిణామాలకు కూడా సమయమే సమాధానం చెబుతుందని అన్నారు.