Tirumala | తిరుమల నడక మార్గంలో కొత్త నిబంధనలు.. మధ్యాహ్నం నుంచి వారికి అనుమతి నిషేధం

Tirumala | మధ్యాహ్నం 2గంటల నుంచి 15ఏళ్ల లోపు వారికి అనుమతి నిషేధం విధాత : భక్తుల భద్రత నేపధ్యంలో తిరుమల నడక మార్గంలో టీటీడీ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. నడక దారిలో చిన్నారులపై చిరుతల దాడి.. తాజాగా బాలిక లక్షిత చిరుత దాడిల మృతి చెందిన నేపధ్యంలో టీటీడీ భక్తుల భద్రత ఏర్పాట్లపై ఆదివారం సుదీర్ఘంగా చర్చించి నడక మార్గంలో పలు ఆంక్షలను ప్రకటించింది. అలిపిరి, శ్రీవారి మెట్టు కాలిబాట మార్గంలో మధ్యాహ్నం 2గంటల […]

  • Publish Date - August 13, 2023 / 01:57 PM IST

Tirumala |

మధ్యాహ్నం 2గంటల నుంచి 15ఏళ్ల లోపు వారికి అనుమతి నిషేధం

విధాత : భక్తుల భద్రత నేపధ్యంలో తిరుమల నడక మార్గంలో టీటీడీ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. నడక దారిలో చిన్నారులపై చిరుతల దాడి.. తాజాగా బాలిక లక్షిత చిరుత దాడిల మృతి చెందిన నేపధ్యంలో టీటీడీ భక్తుల భద్రత ఏర్పాట్లపై ఆదివారం సుదీర్ఘంగా చర్చించి నడక మార్గంలో పలు ఆంక్షలను ప్రకటించింది.

అలిపిరి, శ్రీవారి మెట్టు కాలిబాట మార్గంలో మధ్యాహ్నం 2గంటల తర్వాతా 15ఏళ్ల లోపు పిల్లలకు అనుమతి లేదని టీటీడీ వెల్లడించింది. 15 ఏళ్ల పైబడిన భక్తులకు అలిపిరి కాలిబాట మార్గంలో ఉదయం 5గంటల నుంచి రాత్రి 10గంటల వరకు, శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు అనుమతించనున్నట్లుగా తెలిపింది.

అలాగే కాలిబాట మార్గంలో చిన్నారులు తప్పిపోకుండా పిల్లల చేతికి పోలీసు సిబ్బంది ట్యాగ్‌లు వేస్తున్నారు. ట్యాగ్‌లపై పిల్లల పేరుతో పాటు తల్లిదండ్రుల వివరాలను కూడా పొందుపరుస్తున్నారు. ఈ ట్యాగ్‌ల ఆధారంగా పిల్లలు తప్పిపోతే వారి ఆచూకీని సులభంగా కనపెట్టే అవకాశముంటుంది.

మరోవైపు రెండవ ఘాట్ రోడ్డులో ఆదివారం చిరుత సంచారం నేపధ్యంలో నడకదారిలో సాయంతం వేళ భక్తుల అనుమతి విషయమై టీటీడీ తర్జన భర్జన సాగిస్తుంది. మరోవైపు లక్షిత పై దాడి చేసిన చిరుత బంధించేందుకు అటవీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

గత రెండు రోజులుగా ఘాట్ రోడ్డు, నడక మార్గాలలో ఐదు చిరుతలు సంచరించినట్లుగా గుర్తించడంతో భక్తులను మరింత అప్రమత్తం చేస్తున్నారు. భద్రతా సిబ్బంది వెంటరాగా గుంపులుగా వారిని నడక మార్గాలలో అనుమతిస్తున్నారు.