Rasi Phalalu: Feb19, బుధవారం.. నేటి మీరాశి ఫలాలు! వారికి స్వల్ప అనారోగ్యం, మానసిక ఆందోళనలు

Rasi Phalalu| జ్యోతిషం, రాశి ఫలాలు అంటే మన తెలుగు వారికి ఏండ్ల తరబడి చెరగని నమ్మకం ఉంది. లేచినప్పటి నుంచి నిద్రించే వరకు మంచే జరగాలని కోరుకుంటూ ఉంటాం. అందుకే ప్రతీ రోజూ మన రాశి ఫలాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మన పనులు నిర్వహిస్తూ ఉంటాం. దాని ప్రకారమే నడుచుకుంటూ ఉంటాం కూడా. అందుకే నిద్ర లేవగానే మొదట చాలామంది వెతికేది వారికి ఆ రోజు ఎలా ఉండబోతుందనే. అలాంటి వారందరి కోసం వారి పేర్ల మీద నేటి ఈ రోజు (బుధవారం) మీరాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం
అనవసరమైన భయాందోళనలు పోతాయి. అవకాశాలు కలసి వస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థాన చలనం. ఆర్థిక పరిస్థితిలో మార్పులు. ఒంటరితనం. రుణప్రయత్నాలు. ఆత్మీయుల సహకారం ఆలస్యం. కొత్త వారితో పరిచయాలు.
వృషభం
స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. నిరుత్సాహంగా కాలం వెళ్లదీస్తారు. అపకీర్తి. అనారోగ్య బాధలు ఉండవు. అనుకొన్న పనులు పూర్తి చేసుకుంటారు. ఆకస్మిక ఖర్చులు, ప్రయాణాలు ఉంటాయి. కొత్త స్నేహాలు.
మిథునం
ఆకస్మిక ధననష్టం. ఖర్చులు ఎక్కువ. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవాలి. స్వల్ప అనారోగ్య బాధలు. వృధా ప్రయాణాలు అధికం. స్థానచలనాలు ఉంటాయి. సన్నిహితులతో విరోధం. గృహ, భూ వసతులకై చేయు యత్నాలు అనుకూలి స్తాయి. వాహనాల ఉపయోగాల్లో జాగ్రత్తలు అవసరం.
కర్కాటకం
ఆకస్మిక ధనలాభం. నూతన వస్తు, ఆభరణాలు పొందుతారు.ఇతరుల నుంచి సహాయ సహాకారాలు ఉంటాయి. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణబాధలు తొలగిపోతాయి. శత్రుబాధలు ఉండవు.
సింహం
బంధు, మిత్రులను కలుస్తారు. నూతన గృహనిర్మాణ ప్రయత్నం చేస్తారు.ఇంటా బయటా ఒత్తిడి. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలుగుతాయి. కుటుంబ సౌఖ్యం, శతృబాధలు దూరమవుతాయి. నూతన కార్య క్రమాలు ప్రారంభించి పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక సమస్యలు తొలుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
కన్య
గౌరవ మర్యాదలకు లోపం ఉండదు. అనవసర వ్యయప్రయాసలు, ప్రయాణాలు అధికం. నూతన వ్యాపార వ్యవహార ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మానసిక ఆందోళన. బంధు మిత్రులతో వైరం అవకాశం. శారీరకంగా బలహీనులవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రయత్నాలు ఉత్సాహంగా సాగుతాయి.
తుల
తోటివారితో విరోధం. వ్యాపార వళ్ల ధననష్టం. వృధా ప్రయాణాలు ఎక్కువ. కుటుంబ విషయాల్లో అనాసక్తి. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. చేపట్టిన పనులు వేగంగా పూర్తి. అనుకూలంగా సంతాన విద్యా, ఉద్యోగ ప్రయత్నాలు. అనారోగ్య సమస్యలతో చిరాకు.
వృశ్చికం
కుటుంబంలో చిన్నచిన్న గొడవలు. పరిస్థితిని అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులు అధిగమించడానికి రుణప్రయత్నాలు. ఆలస్యంగా బంధు, మిత్రుల సహాయసహకారాలు. కుటుంబ వాతావరణం ప్రశాంతం.
ధనుస్సు
బంధు మిత్రులతో విరోధం. ఆర్థిక ఇబ్బందులు తప్పవు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో ఒత్తిడులు. స్వల్ప అనారోగ్య బాధలు. వృత్తి ఉద్యోగ రంగాల్లో వృద్ధి. అనుకొన్న పనులకు ప్రతిబంధకాలు. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్నలోపం, పనులు పూర్తి చేసుకోలేక పోతారు.
మకరం
ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు. ఆకస్మిక ధననష్టం. అనారోగ్య బాధలు, డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. కుటుంబ వ్యక్తుల తీరు చికాకుపరచగలదు. తీర్థయాత్రలకు ప్రయత్నం. దైవదర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసం పొందుతారు. సొంత వ్యవహారాల్లో ఇతరులను దూరంగా ఉంచాలి.
కుంభం
కొత్త కార్యాలకు శ్రీకారం. మానసిక ఆనందం ఉంటుంది. కొన్ని తప్పనిసరి ప్రయాణాలు ప్రతి విషయంలో వ్యయ, ప్రయాసలు తప్పవు. ఆకస్మిక ధననష్టం. వృత్తిరీత్యా కొత్త సమస్యలు. కలసిరాని ఆలోచనలు అధికం. బంధు, మిత్రులతో కలహాలు, జాగ్రత్త వహించాలి.
మీనం
అపకీర్తి రాకుండా జాగ్రత్త వహించాలి. ఈర్ష్య, అసూయలు ఎక్కువగా. మనోల్లాసం పొందుతారు. సోదరులతో ప్రేమగా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు. ఋణ భారాలు అధికంగా ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. కొత్త వ్యక్తుల జోలికి వెళ్లకూడదు. వ్యవహారాల్లో నిశ్చితమైన అభిప్రాయం ఉండాలి.