HYD: రాంగ్ రూట్‌ రూ.1700, ట్రిపుల్ రైడింగ్ రూ. 1200/.. 28 నుంచి అమ‌ల్లోకి

Traffic Rules | మీరు హైద‌రాబాద్‌లో డ్రైవింగ్ చేస్తున్నారా? రాంగ్ రూట్‌లో వెళ్తున్నారా? ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారా? అయితే జ‌ర జాగ్ర‌త్త‌.. ఇక నుంచి ఇలాంటి వాహ‌న‌దారుల‌పై ట్రాఫిక్ పోలీసులు నిఘా ఉంచ‌నున్నారు. ట్రాఫిక్ నిబంధ‌న‌లు ఉల్లంఘించే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునేందుకు సిటీ పోలీసులు సిద్ధ‌మ‌వుతున్నారు. భారీ జ‌రిమానా విధించ‌నున్నారు. రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేస్తే రూ. 1700, ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ. 1200 జ‌రిమానా విధించ‌నున్న‌ట్లు ట్రాఫిక్ పోలీసులు స్ప‌ష్టం చేశారు. ఈ […]

  • Publish Date - November 19, 2022 / 03:40 PM IST

Traffic Rules | మీరు హైద‌రాబాద్‌లో డ్రైవింగ్ చేస్తున్నారా? రాంగ్ రూట్‌లో వెళ్తున్నారా? ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారా? అయితే జ‌ర జాగ్ర‌త్త‌.. ఇక నుంచి ఇలాంటి వాహ‌న‌దారుల‌పై ట్రాఫిక్ పోలీసులు నిఘా ఉంచ‌నున్నారు. ట్రాఫిక్ నిబంధ‌న‌లు ఉల్లంఘించే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునేందుకు సిటీ పోలీసులు సిద్ధ‌మ‌వుతున్నారు. భారీ జ‌రిమానా విధించ‌నున్నారు.

రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేస్తే రూ. 1700, ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ. 1200 జ‌రిమానా విధించ‌నున్న‌ట్లు ట్రాఫిక్ పోలీసులు స్ప‌ష్టం చేశారు. ఈ రెండింటిపై ఈ నెల 28 నుంచి ట్రాఫిక్ పోలీసులు ప్ర‌త్యేక డ్రైవ్ నిర్వ‌హించ‌నున్నారు.

ట్రాఫిక్ చ‌ర్య‌ల్లో భాగంగా ఇటీవ‌లే హైద‌రాబాద్ పోలీసులు ఆప‌రేష‌న్ రోప్ చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద స్టాప్‌ లైన్ దాటితే రూ.100, ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్‌ చేస్తే రూ.1000, పాదాచారులకు అడ్డు కలిగించేలా వాహనాలు నిలిపితే రూ.600 జరిమానా విధిస్తున్న విషయం తెలిసిందే. ట్రాఫిక్‌ పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్‌ రోప్‌’ విజయవంతం కావడంతో.. తాజాగా ట్రాఫిక్‌ నిబంధనలు మరింత కఠినతరం చేయాలని నిర్ణయించారు.