తల్లిదండ్రులు కాబోతున్న ట్రాన్స్‌జెండర్ జంట.. దేశంలోనే తొలిసారి
Trans Couple | దేశంలోనే తొలిసారి ఓ ట్రాన్స్‌జెండర్ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆ ట్రాన్స్ జంట సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. అదేదో బిడ్డను దత్తత తీసుకోవడమో, లేదా సరోగసి పద్ధతిలో బిడ్డను కనడం లేదు. ఒక సాధారణ స్త్రీ ఎలాగైతే బిడ్డను కంటుందో.. ఆ మాదిరిగా ఈ ట్రాన్స్ జంట పండంటి బిడ్డకు జన్మ ఇవ్వబోతున్నారు. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ ఇది నిజం. View this post on […]

Trans Couple | దేశంలోనే తొలిసారి ఓ ట్రాన్స్‌జెండర్ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆ ట్రాన్స్ జంట సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. అదేదో బిడ్డను దత్తత తీసుకోవడమో, లేదా సరోగసి పద్ధతిలో బిడ్డను కనడం లేదు. ఒక సాధారణ స్త్రీ ఎలాగైతే బిడ్డను కంటుందో.. ఆ మాదిరిగా ఈ ట్రాన్స్ జంట పండంటి బిడ్డకు జన్మ ఇవ్వబోతున్నారు. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ ఇది నిజం.
View this post on Instagram
వివరాల్లోకి వెళ్తే.. కేరళ రాష్ట్రం కోజికోడ్‌కు చెందిన జియా పావెల్, జహాద్ అనే ట్రాన్స్‌జెండర్ జంట మూడేండ్ల నుంచి సహజీవనంలో ఉన్నారు. అబ్బాయిగా పుట్టిన జియా పావెల్ అమ్మాయిలా మారింది. అమ్మాయిలా పుట్టిన జహాద్ అబ్బాయిలా మారే క్రమంలోనే గర్భం ధరించాడు. దీంతో అబ్బాయిలా మారే ప్రక్రియను జహాద్ వాయిదా వేసుకున్నాడు.
‘తల్లి కావాలనుకునే నా కల, తండ్రి కావాలనుకునే తన కోరిక త్వరలోనే తీరనున్నాయి అంటూ జియా పావెల్ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. నేను పుట్టుకతో స్త్రీని కానప్పటికీ.. ఒక బిడ్డ నన్ను అమ్మ అని పిలుస్తుంది. ఓ బిడ్డతో అమ్మా అని పిలపించుకోవాలనే నా కల త్వరలోనే తీరనుంది. నేను, జహాద్ మూడేండ్ల నుంచి సహజీవనంలో ఉన్నాం. నేను తల్లిని కావాలని ఎలా కలలు కంటున్నానో.. ఆ విధంగానే అతను కూడా తండ్రి కావాలని కలలు కంటున్నాడని జియా ఇన్‌స్టాలో తెలిపింది. ఇద్దరి సమ్మతితో జహాద్ మరో నెల రోజుల్లో పండంటి బిడ్డకు జన్మ ఇవ్వబోతున్నాడని జియా పావెల్ వెల్లడించింది.
View this post on Instagram
అబ్బాయిగా మారిన తర్వాత గర్భం ఎలా సాధ్యం..?
ట్రాన్స్‌జెండర్లు తమ ప్రత్యుత్పత్తి అవయవాలను మార్చుకోవడానికి శస్త్ర చికిత్సను ఆశ్రయించారు. జియా పావెల్ అబ్బాయిగా పుట్టి, స్త్రీగా మారాడు. జహాద్ స్త్రీగా జన్మించగా, తర్వాత పురుషుడిగా మారాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం సర్జరీ కూడా చేయించుకున్నాడు. కానీ ఈ సర్జరీలో జహాద్ గర్భాశయం, మరికొన్ని అవయవాలు తొలగించలేదు. ఈ క్రమంలోనే అతను గర్భం ధరించాడు.