Maharashtra | మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి ట్రాన్స్‌జెండర్‌తో అసహజ శృంగారం చేశాడు. మరో ట్రాన్స్‌జెండర్‌పై కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని గోవండి ఏరియాలో ఓ ట్రాన్స్‌జెండర్ తన రూమ్‌కు వెళ్తుండగా.. ఓ ముగ్గురు వ్యక్తులు అడ్డుకున్నారు. అందులో ఒకరు ట్రాన్స్‌జెండర్‌తో అసహజ శృంగారానికి పాల్పడ్డాడు. అయితే ట్రాన్స్‌జెండర్‌ను ముగ్గురు వ్యక్తులు అడ్డుకున్న విషయం మరో ట్రాన్స్‌జెండర్‌కు తెలిసింది. దీంతో ఆమె ఘటనాస్థలికి పరుగెత్తుకు వచ్చింది. వారిని అడ్డుకోబోయిన ఆ ట్రాన్స్‌జెండర్‌పై కత్తితో దాడి చేసి పారిపోయారు. సమాచారం అందుకున్న శివాజీ నగర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఇద్దరు ట్రాన్స్‌జెండర్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.