కొత్త ప్రభుత్వంలో ‘రెవెన్యూ’కి పునర్వైభవం

కొత్త ప్రభుత్వంలో ‘రెవెన్యూ’కి పునర్వైభవం
  • ట్రెసా ఆకాంక్ష.. మంత్రి పొంగులేటికి శుభాకాంక్షలు


విధాత: సీఎం రేవంత్‌రెడ్డి కొత్త ప్రభుత్వంలో ‘రెవెన్యూ’కి పునర్వైభవం రావాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ట్రెసా) ఆకాక్షించింది. ఆదివారం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ట్రెసా అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్ కుమార్‌లతో కూడిన ప్రతినిధి బృందం కలిసి శుభాకాంక్షలు తెలిపారు.


సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి విశిష్ట నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడడం సంతోషకరమని, మీ సమర్థవంతమైన నాయకత్వంలో గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థను పునర్నిర్మించి ప్రజలకు మెరుగైన సేవలు అందే విధంగా చూడాలని ట్రెసా బృందం ఆకాంక్షింది.


రెవెన్యూ శాఖలో వివిధ స్థాయిలో పరిపాలనను మరింత పటిష్టం చేయాలని ఈసందర్భంగా మంత్రిని కోరారు. విఆర్వో, వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని, కంప్యూటర్ ఆపరేటర్లకు రెగ్యులరైజ్ చేయాలని ప్రత్యేకంగా కోరారు. రెవెన్యూ ఉద్యోగులంతా మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారని ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహరిస్తామని ట్రెసా తెల్పింది.


ధరణి పోర్టల్ కి సంబంధించిన భూ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందిస్తామని, ఈ సమస్యల పరిష్కారించబడి ప్రజలకు మేలు జరగాలంటే అధికార వికేంద్రీకరణ జరగాలని కోరారు. దీనిపై మంత్రి పొంగులేటి సానుకూలంగా స్పందించి త్వరలో సమావేశం ఏర్పాటు చేసి రెవెన్యూ సమస్యలను పరిష్కరించుటకు తగు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.


ఈ కార్యక్రమంలో ట్రెసా అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ శ్రీ ఏనుగు నర్సింహా రెడ్డి, విజయేందర్ రెడ్డి లతో పాటు డిప్యూటీ కలెక్టర్ మహిపాల్ రెడ్డి,ట్రెసా ఉపాధ్యక్షులు కె. నిరంజన్,ఎం.డి.అన్వర్, నాగమణి, రమేష్ పాక, కార్యదర్శులు పల్నాటి శ్రీనివాస్ రెడ్డి,గోవర్ధన్, వాణి రెడ్డి, నిజామాబాదు జిల్లా అధ్యక్షులు రమన్ రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు సుధాకర్, కార్యవర్గ సభ్యులు అయ్యప్ప, సైదులు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.