TSPSC | ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో కీలక పరిణామం

TSPSC టీఎస్‌పీఎస్సీ కమిషన్ చైర్మన్‌, కమిషన్‌ కార్యదర్శిని విచారిస్తున్న ఈడీ వీరిద్దరిని మనీ లావాదేవీలపైనే విచారిస్తున్నట్లు సమాచారం విధాత‌: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ( TSPSC) ప్రశ్నపత్రాల లీకేజీ కేసు(paper leakage case)లో కీలక పరిణామం చోటుచేసుకున్నది. తాజాగా టీఎస్‌పీఎస్సీ కమిషన్ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి, కమిషన్‌ కార్యదర్శి అనిత రామచంద్రన్‌ను ఈడీ ప్రశ్నిస్తున్నది. ఈ కేసుకు సంబంధించి వీరిద్దరిని పలు ప్రశ్నలపై విచారిస్తున్నట్లు సమాచారం. వీరి వాంగ్మూలాలు ఈడీ(ED) అధికారులు నమోదు చేయనున్నారు. ప్రధానంగా మనీ లావాదేవీలపైనే […]

  • Publish Date - May 1, 2023 / 01:07 AM IST

TSPSC

  • టీఎస్‌పీఎస్సీ కమిషన్ చైర్మన్‌, కమిషన్‌ కార్యదర్శిని విచారిస్తున్న ఈడీ
  • వీరిద్దరిని మనీ లావాదేవీలపైనే విచారిస్తున్నట్లు సమాచారం

విధాత‌: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ( TSPSC) ప్రశ్నపత్రాల లీకేజీ కేసు(paper leakage case)లో కీలక పరిణామం చోటుచేసుకున్నది. తాజాగా టీఎస్‌పీఎస్సీ కమిషన్ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి, కమిషన్‌ కార్యదర్శి అనిత రామచంద్రన్‌ను ఈడీ ప్రశ్నిస్తున్నది. ఈ కేసుకు సంబంధించి వీరిద్దరిని పలు ప్రశ్నలపై విచారిస్తున్నట్లు సమాచారం. వీరి వాంగ్మూలాలు ఈడీ(ED) అధికారులు నమోదు చేయనున్నారు. ప్రధానంగా మనీ లావాదేవీలపైనే విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

హైకోర్టు(Highcourt) కూడా ఈ కేసు దర్యాప్తు ఇంకా ఎంత కాలం చేస్తారని సిట్‌(SIT) అధికారులను ప్రశ్నించిన విషయం విదితమే. పేపర్‌ లీకేజీ కేసులో పెద్ద ఎత్తున మనీ లావాదేవీలు జరగడంతో ఈడీ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్టైన నిందితులను చంచల్‌గూడ్‌ జైళ్లో విచారించిన ఈడీ అధికారులు వాంగ్మూలాలు నమోదు చేశారు.

ప్రశ్నపత్రాల లీకేజీలో ఇప్పటివరకు దాదాపు రూ.38 లక్షల లావాదేవీలు జరిగినట్లు సిట్‌ దర్యాప్తులో తేలింది. సిట్‌ దర్యాప్తు ఆధారంగా మనీలాండరింగ్‌ కోణంలో ఈడీ విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో కమిషన్ చైర్మన్‌, కార్యదర్శిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. సిట్‌ దర్యాప్తుతో పాటు ఈడీ విచారణ అనంతరం ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి రావచ్చు అంటున్నారు.

Latest News