జనాన్ని మరిపించేందుకేనా.. స్టీల్ ప్లాంట్!

TSPSC లీకేజీ కేసు చెట్టెక్కినట్టేనా? జనాన్ని మరిపించేందుకు SSC పేపర్స్ లీకేజీ, స్టీల్ ప్లాంట్ కథలు విధాత‌: కేసీఆర్ (KCR) తెలంగాణ ముఖ్యమంత్రికి ప్రజల జ్ఞాపకశక్తి మీద అపారమైన నమ్మకం. వారి విజ్ఞత మీద అదే నమ్మకం. ఏదైనా ఒక ఉపద్రవం, ప్రభుత్వం పాలిట ఓ సమస్య ఎదురైంది, అది తన పాలనా సమర్థతను, తన మేధావితనాన్ని, పాలనలో తన పట్టును కానీ ప్రశ్నించే పరిస్థితి ఉందని తెలిస్తే.. దాన్ని చప్పున చల్లార్చెస్తారు. అంటే తన సమర్థతతో […]

  • Publish Date - April 12, 2023 / 02:02 PM IST
  • TSPSC లీకేజీ కేసు చెట్టెక్కినట్టేనా?
  • జనాన్ని మరిపించేందుకు SSC పేపర్స్ లీకేజీ, స్టీల్ ప్లాంట్ కథలు

విధాత‌: కేసీఆర్ (KCR) తెలంగాణ ముఖ్యమంత్రికి ప్రజల జ్ఞాపకశక్తి మీద అపారమైన నమ్మకం. వారి విజ్ఞత మీద అదే నమ్మకం. ఏదైనా ఒక ఉపద్రవం, ప్రభుత్వం పాలిట ఓ సమస్య ఎదురైంది, అది తన పాలనా సమర్థతను, తన మేధావితనాన్ని, పాలనలో తన పట్టును కానీ ప్రశ్నించే పరిస్థితి ఉందని తెలిస్తే.. దాన్ని చప్పున చల్లార్చెస్తారు.

అంటే తన సమర్థతతో మాత్రం కాదు.. ఒక సమస్య వచ్చినపుడు దాన్నుంచి తప్పించుకోవడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి ఇంకో సమస్యను సృష్టిస్తారని అంటుంటారు. దేశవ్యాప్తంగా సంచలనం అయిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పేపర్ల లీకేజీ కేసీఆర్ పాలనాపై ప్రజల్లో పలు అనుమానాలు రేకెత్తించింది.

రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, విద్యావంతులు, మేధావులు యువత ఆవేశంతో రగిలిపోయారు. ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ నుంచి అత్యంత రహస్యంగా ఉండాల్సిన ప్రశ్న పత్రాలు బయటకు రావడం అంటే మాటలు కాదు. అందులోని ప్రతి బాధ్యులనూ కోర్టుకు లాగి శిక్షించాలని సమాజం ఘోషిస్తోంది.

ఇదేదో కొంపలు మునిగేలా ఉందని భావించిన ప్రభుత్వం వెంటనే దాన్ని నీరుగార్చేందుకు వెంటనే పదో క్లాస్ పేపర్స్ లీకేజీని (SSC PAPERS LEAKAGE) బయటకు తీశారు. ఇందులో ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఇరికించి జైలుకు పంపారు. ఈ హడావుడి వారం నడిచింది. దీంతో పాపం ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ల వ్యవహారం పక్కకు పోయింది.

ఇదిలా ఉండగానే ఇప్పుడు కొత్తగా విశాఖ స్టీల్ ప్లాంట్ లో వాటా కొనేందుకు బిడ్లు (BIDS)వేస్తాం అంటూ ఇంకో డ్రామాకు తెర తీశారని సామాన్య జనం అనుకుంటున్నారు. అసలు అందులో పాల్గొనేందుకు నిభందనలు ఒప్పుకోవని అందరూ చెబుతున్నా ఏదో పొలిటికల్ మైలేజీ కోసం ఆ హడావుడి చేస్తున్నారని అనుకుంటున్నారు.

ఇంకా కొందరు సింగరేణి అధికారులు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు వెళ్లడం, అక్కడి పరిస్థితులు చూసి రావడం.. అదేదో స్టీల్ ప్లాంట్‌ను (VISAKHA STEEL PLANT) తెలంగాణ కొనేస్తున్నదని, కేసీఆర్‌ తీసుకున్న ఈ నిర్ణయం అటు జగన్‌ను బీజేపీనీ బాగా ఇరుకున పెట్టేసినట్లుగా బారిన కోడి రూపాయి మసాలా అన్న చందంగా తెగ ప్రచారం చేస్తున్నాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఇప్పుడు హరీశ్‌ రావు (HARISH RAO) కూడా ఆంధ్రావాళ్ళు ఇక్కడ ఓట్లు నమోదు చేయించుకోండి, మీకు ఆంధ్రాలో పని లేదు.. ఇదే అసలైన అభివృద్ధి చెందిన రాష్ట్రం.. అంటూ మాట్లాడాన్ని తెలంగాణ ప్రజలు సైతం వ్యతిరేకిస్తున్నారు.. మంత్రి మాటలు రెండు రాష్ట్రాల మధ్య వైరానికి ఆజ్యం పోసి దాని దగ్గర కూర్చుని చలి కాచుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోందని అనుకుంటున్నారు. మొత్తానికి ఒక సమస్య నుంచి, ఒక ఇబ్బంది నుంచి ప్రజలను డైవర్ట్ చేయడంలో కేసీఆర్‌ను మించిన నాయకుడు లేడని మరోమారు రుజువైందని నెటిజన్లు భావిస్తున్నారు.