నక్సల్‌ దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్‌ జవాన్లకు గాయాలు

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి మావోయిస్టులు చెలరేగారు. దంతేవాడలో సీఆర్పీఎఫ్‌ జవాన్లను టార్గెట్‌ చేసి మందుపాతర పేల్చారు

  • By: Somu    latest    Dec 02, 2023 11:35 AM IST
నక్సల్‌ దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్‌ జవాన్లకు గాయాలు
  • ఛత్తీస్‌గఢ్‌లో ఘటన



రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి మావోయిస్టులు చెలరేగారు. దంతేవాడలో సీఆర్పీఎఫ్‌ జవాన్లను టార్గెట్‌ చేసి మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్‌ 195వ బెటాలియన్‌కు చెందిన ఇద్దరు జవాన్లకు, ఒక మీడియా వ్యక్తికి గాయాలయ్యాయి. డిసెంబర్‌ 2 నుంచి 8 వరకూ పీజీఎల్‌ఏ వారోత్సవాలకు మావోయిస్టులు పిలుపునిచ్చారు. వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోయిన తమ సహచరుల జ్ఞాపకార్థం అమరవీరుల స్మృత్యర్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు.


ఈ ఏడాది 54 మంది మావోయిస్టులు చనిపోయారని ప్రకటించారు. దీనికి సంబందించిన కరపత్రాలను విడుదల చేశారు. పోస్టర్లను అంటించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన సీఆర్పీఎఫ్‌ జవాన్లు దంతేవాడలో శనివారం ఉదయం పోస్టర్లను తొలగిస్తుండగా.. మందుపాతర పేల్చారు. గాయపడిన ఇద్దరు జవాన్లను పోలీసులు సమీప ఆరోగ్య కేంద్రానికి తరలించారు. జవాన్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.