ఆసియా క్రీడ‌ల్లో భార‌త్‌కు మ‌రో రెండు స్వ‌ర్ణాలు

ఆసియా క్రీడ‌ల్లో భార‌త్‌కు మ‌రో రెండు స్వ‌ర్ణాలు
  •  స్టీపుల్‌చేజ్‌లో రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన అవినాశ్ సాబ్లే
  • షాట్‌పుట్‌లో తేజింద‌ర్‌ పాల్‌సింగ్ తూర్

విధాత‌, హైద‌రాబాద్‌: ఆసియా క్రీడ‌ల్లో భార‌త్‌కు మ‌రో రెండు స్వ‌ర్ణాలు ద‌క్కాయి. ఆదివారం జ‌రిగిన 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో అవినాశ్ సాబ్లే రికార్డు బద్దలు కొట్టాడు. 8:19.50 సెకన్లలో రేసును పూర్తి చేసి బంగారు పతకాన్ని సాధించాడు. స్టీపుల్‌చేజ్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడిగా 29 ఏళ్ల అవినాశ్ సాబ్లే రికార్డు సృష్టించాడు.



2018 జకార్తా గేమ్స్‌లో ఇరాన్‌కు చెందిన హోస్సేన్ కీహానీ 8:22.79 నిమిషాల్లో ఫినిష్ చేసి రికార్డు సృష్టించ‌గా దాన్ని సాబ్లే తిర‌గ రాశాడు. ఇక షాట్‌పుట్‌లో భార‌త బాహుబ‌లి తేజింద‌ర్‌ పాల్‌సింగ్ తూర్ కూడా బంగారు ప‌తకాన్ని సాధించాడు. అంద‌రికంటే ఎక్కువ దూరం 20.36 మీట‌ర్లు విసిరి స్వ‌ర్ణాన్ని కైవ‌సం చేసుకున్నాడు.



మరోవైపు పురుషుల 50మీటర్ల ట్రాప్ ఈవెంట్ లో భారత్ కాంస్యం నెగ్గింది. మహిళల 1500 మీటర్ల ఫైనల్ లో హర్మిలన్ రజతం సాధించింది. పురుషుల 1500 మీటర్ల ఫైనల్ లో అజయ్ రజతం, జిన్సన్ జాన్సన్ కాంస్యం సాధించారు. ఇప్పటి వరకూ భారత్ మొత్తం 48 పతకాలతో ఆసియా క్రీడలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. అందులో 13 స్వర్ణం, 18 రజతం, 17 కాంస్య పతకాలు సాధించింది.