పార్లమెంటుపై టీయర్ గ్యాస్ దాడి నిందితుల గుర్తింపు
పార్లమెంటుపై టీయర్ గ్యాస్ దాడి చేసిన నలుగురు నిందితులను పట్టుకున్న ఢిల్లీ పోలీస్ విభాగం వారి వివరాలను వెల్లడించింది.

విధాత : పార్లమెంటుపై టీయర్ గ్యాస్ దాడి చేసిన నలుగురు నిందితులను పట్టుకున్న ఢిల్లీ పోలీస్ విభాగం వారి వివరాలను వెల్లడించింది. నిందితులు కర్ణాటక రాష్ట్రం మైసూర్‌కు చెందిన సాగర్ శర్మ, మనోరంజన్, హర్యానా హిస్సార్‌కు చెందిన నీలంకౌర్, మహారాష్ట్ర లాతూర్‌కు చెందిన అమోల్ షిండేగా గుర్తించారు.
మైసూర్ వివేకానంద ఇన్‌స్ట్యూట్‌లో చదువుతున్న మనోరంజన్, సాగర్ శర్మలు మూడు రోజుల క్రితం బెంగుళూరు వెలుతున్నామని ఇంటి నుంచి బయలుదేరారు. వారికి ఇతర రాష్ట్రాలకు చెందిన నీలంకౌర్, ఆమోల్ షిండేలతో ఎలా పరిఛయం.. అసలు వారంతా ఏ సంస్థ సభ్యులు.. దాడి వెనుక వారి ఉద్దేశాలమేటన్నదానిపై దర్యాప్తు ముమ్మరం చేశారు.
లోక్ సభలో దూరిన నిందితులను నీలం కౌర్, అమోల్ షిండేగా గుర్తించారు. వారిద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. దాడి సందర్భంగా నిందితులు తానాషాహి బంద్‌కరో..నియంతృత్వం చెల్లదు..రాజ్యంగాన్ని కాపాడాలి.. జై బీమ్..భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. వారు మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహ పేరుతో విజిటర్స్ పాస్‌లతో సభలోకి వచ్చారు.