Ulta Rath Yatra | త్రిపుర జగన్నాథ ఉల్టా యాత్రలో విషాదం.. విద్యుత్‌ షాక్‌తో ఏడుగురు మృతి

Ulta Rath Yatra | త్రిపుర ఉనాకోటి జిల్లా కుమార్‌ఘాట్‌లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. జగన్నాథ స్వామి ఉల్టా రథయాత్రలో పాల్గొన్న ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు కరెంట్‌ షాక్‌తో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కుమార్‌ఘాట్‌ ప్రాంతంలో సాయంత్రం 4.30 బుధవారం ఉల్టా రథయాత్ర జరిగింది. వేడుకకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రథాన్ని భక్తులు లాగుతున్న సమయంలో రథం ఒక్కసారిగా విద్యుత్‌ హైటెన్షన్‌ వైర్లను రథం తాకింది. ఇనుముతో చేసిన రథం కావడంతో విద్యుత్‌ […]

  • Publish Date - June 28, 2023 / 04:11 PM IST

Ulta Rath Yatra | త్రిపుర ఉనాకోటి జిల్లా కుమార్‌ఘాట్‌లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. జగన్నాథ స్వామి ఉల్టా రథయాత్రలో పాల్గొన్న ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు కరెంట్‌ షాక్‌తో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కుమార్‌ఘాట్‌ ప్రాంతంలో సాయంత్రం 4.30 బుధవారం ఉల్టా రథయాత్ర జరిగింది.

వేడుకకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రథాన్ని భక్తులు లాగుతున్న సమయంలో రథం ఒక్కసారిగా విద్యుత్‌ హైటెన్షన్‌ వైర్లను రథం తాకింది. ఇనుముతో చేసిన రథం కావడంతో విద్యుత్‌ ఘాతంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కరెంటు షాక్‌తో ఏడుగురు మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.

క్షతగాతుల్రను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై ముఖ్యమంత్రి మాణిక్‌ సాహా సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించిన ఆయన.. క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు.