YCP ఆధ్వర్యంలో.. NTR జయంతి
YCP.. NTR Jayanti విధాత: రాజమండ్రిలో ప్రతిపక్ష తెలుగుదేశం సారధ్యంలో ధూమ్ ధామ్ గా మహానాడు, ఎన్టీయార్ జయంతి నిర్వహిస్తూ ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఐతే ఇటు YCP కూడా ఆయన్ను స్మరించుకుంటోంది. వాస్తవానికి వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులూ జగన్ సహా , కొడాలి, పేర్ని నాని ఇత్యాది నాయకులూ ఏనాడూ ఎన్టీయార్ ను విమర్శించింది లేదు, పైగా జగన్ జిల్లాలు విభజన చేసాక ఎన్టీయార్ పేరిట జిల్లాను ఏర్పాటు చేస్తూ పెద్దాయన పట్ల గౌరవాన్ని చాటుకున్నారు. […]

YCP.. NTR Jayanti
విధాత: రాజమండ్రిలో ప్రతిపక్ష తెలుగుదేశం సారధ్యంలో ధూమ్ ధామ్ గా మహానాడు, ఎన్టీయార్ జయంతి నిర్వహిస్తూ ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఐతే ఇటు YCP కూడా ఆయన్ను స్మరించుకుంటోంది. వాస్తవానికి వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులూ జగన్ సహా , కొడాలి, పేర్ని నాని ఇత్యాది నాయకులూ ఏనాడూ ఎన్టీయార్ ను విమర్శించింది లేదు, పైగా జగన్ జిల్లాలు విభజన చేసాక ఎన్టీయార్ పేరిట జిల్లాను ఏర్పాటు చేస్తూ పెద్దాయన పట్ల గౌరవాన్ని చాటుకున్నారు.
పోన్లే ఇన్నాళ్లలో చంద్రబాబు చేయలేనిది జగన్ చేసారు అని ఆఖరుకు ఎన్టీయార్ అభిమానులు సైతం జగన్ను అభినందించే విధంగా ఆయన్ను గౌరవించారు. ఇక ఇప్పుడు రాజమండ్రిలో ఎన్టీయార్ జయంతి, మహానాడుకు దీటుగా అని కాకపోయినా ఓ చిన్నపాటి ప్రోగ్రాం ఏర్పాటు చేసి పెద్ద ఎన్టీయార్ కు నివాళులు అర్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ నిర్ణయించి, ఈ మేరకు ఓ కార్యక్రమం నిర్వహిస్తోంది.
ఎన్టీయార్ లలితా కళా ఎవార్డుల ప్రదానం పేరిట బెండ్ సర్కిల్లో వేదిక ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస, కోడలి నాని, పేర్ని నాని, పోసాని కృష్ణ మురళి , లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు తదితరులు పాల్గొనే ఈ సభలో కొందరు కళాకారులూ, కళారంగంలో పేరు పొందిన ప్రముఖులకు సత్కారాలు, సన్మానాలు చేస్తారు.
దేవినేని అవినాష్ , నందమూరి లక్ష్మి పార్వతుల సారధ్యంలో జరిగే ఈ సభలో ఎన్టీయార్ కు నివాళులు అర్పిస్తారు. ఎన్టీయార్ ను వెన్నుపోటు పొడిచి పదవి లాక్కుని, అవమానించిన వైఎస్సార్ కాంగ్రెస్ ఇప్పుడు అయన పేరిట ఏకంగా ఓ సభ పెట్టి ఎవార్డులు ఇవ్వడం గమనార్హం.
హైదరాబాద్ లో జూనియర్ నివాళులు
..
ఇదిలా ఉండగా జానియర్ ఎన్టీయార్ పొద్దున్నే హైదరాబాద్ లోని ఎన్టీయార్ గార్డెన్స్ లో ఎన్టీయార్ సమాధిని దర్శించి తాతకు నివాళులు అర్పించారు. ఏటా అయన తన అనుచరులు, అభిమానులతో కలిసి ఎన్టీయార్ ఘాట్ కు వెళ్లి నివాళులు అర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు కూడా అయన వెళ్లి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా అయన అభిమానులు సీఎం… సీఎం అంటూ నినదించడం గమనార్హం.