RC15: శంకర్‌-చరణ్ చిత్రంలో ఉపేంద్ర..?

విధాత‌: ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి RC15 అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుతున్నారు. పొలిటికల్ త్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్‌లో తెర‌కెక్కుతోంది. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నారు. వారికి అంజలి, కియారా అద్వానీలు జోడీగా నటిస్తున్నారు. ఫ్లాష్ బ్యాక్‌లో పెద్ద చరణ్ సీఎంగా, యంగ్ రాంచరణ్ […]

  • Publish Date - January 30, 2023 / 05:00 AM IST

విధాత‌: ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి RC15 అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుతున్నారు.

పొలిటికల్ త్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్‌లో తెర‌కెక్కుతోంది. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నారు. వారికి అంజలి, కియారా అద్వానీలు జోడీగా నటిస్తున్నారు. ఫ్లాష్ బ్యాక్‌లో పెద్ద చరణ్ సీఎంగా, యంగ్ రాంచరణ్ ఎన్నికల కమిషనర్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది.

ఇక ఈ చిత్రంలో ఎస్ జె సూర్య, జయరాం, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర, నాజర్, సముద్రఖని తదితరులు కనిపించబోతున్నారు. ఇంతమంది స్టార్స్ ఉన్న ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ను కీలకపాత్రలో నటింపజేసేందుకు చర్చలు జరుగుతున్నాయట.

అందుకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం మెగా కాంపౌండ్ నుంచి వినిపిస్తున్నాయి. ఈ పాత్ర సెకండ్ హాఫ్‌లో వచ్చే సన్నివేశాలలో చరణ్ పాత్రకు గురువు పాత్రగా ఉంటుందట. ఈ పాత్రకు ఉపేంద్ర అయితే బాగుంటుందని భావిస్తున్నారట. ఉపేంద్ర‌కు తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ భాష‌ల‌తో పాటు ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. కనుక ఉపేంద్ర క్రేజ్ ఈ చిత్రానికి పాన్ ఇండియా రేంజిలో ఉపయోగపడుతుందని కచ్చితంగా చెప్పవచ్చు.

ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. విడుదల తేదీ విషయంలో అధికారికంగా దిల్ రాజు కాంపౌండ్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక ఉపేంద్ర గతంలో అల్లు అర్జున్ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం తర్వాత మరోసారి పెద్ద క్రేజీ ప్రాజెక్టులో ఉపేంద్ర నటించే చిత్రం ఇదే అవుతుంది. మరోవైపు ఉపేంద్ర కన్నడలో సూపర్ స్టార్‌గా రెండు పాన్ ఇండియా చిత్రాలను చేస్తున్నారు. ఇందులో ఒక చిత్రంలో ఆయనకు తోడుగా కిచ్చా సుదీప్ కూడా నటిస్తుండడం విశేషం.