ప్రియుడు వేరే అమ్మాయిని చూస్తున్నాడనే కోపంతో ప్రియురాలు అతడి కంటిని పొడిచేసిన ఘటన అమెరికాలో జరిగింది.
విధాత: ప్రియుడు వేరే అమ్మాయిని చూస్తున్నాడనే కోపంతో ప్రియురాలు అతడి కంటిని పొడిచేసిన ఘటన అమెరికా (America) లో జరిగింది. మియామికి చెందిన శాండ్రా జెమెనెజ్ అనే 44 ఏళ్ల మహిళ ఒక వ్యక్తితో సహజీవనంలో ఉంది. వీరిద్దరి మధ్య కొన్ని రోజులుగా ఒక గొడవ జరుగుతోంది. నువ్వు ఇతర మహిళలను చూస్తన్నావని అంటూ ప్రియుడితో ఎప్పుడూ వాదిస్తూ ఉండేది.గురువారం బయటకు వెళ్లినపుడు ఇదే విషయమై వారిద్దరి మధ్యా గొడవ జరిగింది. అలా కోపంగానే ఇంటికి రాగా… తన బాయ్ ఫ్రెండ్‌కు ఎలాగైనా గుణపాఠం చెప్పాలని శాండ్రా నిర్ణయించుకుంది. అతడు అలా సోఫాలో కూర్చోగానే.. మీదకు ఉరికి.. పక్కనే ఉన్న రేబిస్ సూదులతో అతడి కంటిపై పొడిచేసింది.
అనంతరం ఆమె పరారవగా.. బాధితుడు పోలీసులకు ఫోన్ చేశాడు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆసుపత్రిలో చేర్పించారు. తన పెంపుడు కుక్కలకు వేయడానికి తీసుకొచ్చిన రాబిస్ వ్యాక్సిన్ సూదులతో తన ప్రియురాలు పొడిచిందని ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటన అనంతరం పారిపోయినా శాండ్రా.. ఆ ఇంటి బయటే ఉన్న కారులో నిద్రపోయింది. కొద్ది సేపటి తర్వాత ఆమెను గుర్తించిన పోలీసులు.. అదుపులోకి తీసుకున్నారు. తాను చేసిన పనిపట్ల పశ్చాత్తాపం ఏమీ లేదని.. అతడికి ఒక గుణపాఠం చెప్పాలనే అలా చేశానని శాండ్రా చెప్పడంతో పోలీసులు నిర్ఘాంతపోయారు. అనంతరం ఆమెను జైలుకు తరలించారు.