వాణి జయరాం మరణంపై పలు అనుమానాలు..? ముఖంపై గాయాలు..!
Vani Jairam | ప్రముఖ నేపథ్య గాయని వాణి జయరాం మృతి చెందిన విషయం విదితమే. ఆమె మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వాణి ముఖంపై తీవ్ర గాయాలు ఉన్నట్లు పని మనిషి వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆమెది సహజ మరణమేనా..? లేక ఏమైనా కుట్ర జరిగిందా..? అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాణి ఇంటి పని మనిషి కథనం ప్రకారం.. వాణి జయరాం ఇంట్లో పని చేసే మహిళ.. శనివారం యథావిధిగా పని చేసేందుకు గాయని […]

Vani Jairam | ప్రముఖ నేపథ్య గాయని వాణి జయరాం మృతి చెందిన విషయం విదితమే. ఆమె మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వాణి ముఖంపై తీవ్ర గాయాలు ఉన్నట్లు పని మనిషి వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆమెది సహజ మరణమేనా..? లేక ఏమైనా కుట్ర జరిగిందా..? అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వాణి ఇంటి పని మనిషి కథనం ప్రకారం.. వాణి జయరాం ఇంట్లో పని చేసే మహిళ.. శనివారం యథావిధిగా పని చేసేందుకు గాయని ఇంటికి వచ్చింది. ఆమె ఫ్లాట్ తలుపు తట్టగా లోపలి నుంచి స్పందన లేకపోవడంతో.. తన భర్తకు సమాచారం అందించింది. తన ఫోన్ నుంచి వాణి జయరాం ఫోన్‌కు కాల్ చేశాడు. అయినప్పటికీ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో అతను పోలీసులకు సమాచారం అందించాడు.
వాణి ఫ్లాట్ వద్దకు చేరుకున్న పోలీసులు.. ఆ ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే జయరాం స్పృహ కోల్పోయి ఉన్నారు. ముఖంపై తీవ్ర గాయాలు ఉన్నాయి. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె ఫ్లాట్‌ను ఆధీనంలోకి తీసుకుని అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. ఫ్లాట్‌లోని సీసీ ఫుటేజీని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.