వర్మ మరో కోణం.. ఇంత దయార్ద్ర‌ హృదయమా

విధాత‌: దర్శకుడు రాంగోపాల్ వర్మ అంటే దేశవ్యాప్తంగా ఆయనకు పరిచయం అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో అత్యద్భుతమైన చిత్రాలను తీసిన ఆయన ఆ తర్వాత ఫామ్ కోల్పోతూ వచ్చాడు. వాస్తవానికి వర్మ చిత్రాలు ఎంతో రియలిస్టిక్‌గా ఉంటాయి. రా సినిమాలను పోలి ఉంటాయి. అంటే కోలీవుడ్‌లో బాలా చిత్రాల తరహాలో తెలుగులో వర్మ చిత్రాలు ఉంటాయి. అందులో ఎవరిదైనా బయోపిక్ తీసేటప్పుడు ఆయా పాత్రలకు తగ్గ నటీనటులను ఎంపిక చేసుకోవడంలో ఆయన శైలి వేరు. ఒరిజినల్ క్యారెక్టర్‌కు […]

  • Publish Date - January 22, 2023 / 07:26 AM IST

విధాత‌: దర్శకుడు రాంగోపాల్ వర్మ అంటే దేశవ్యాప్తంగా ఆయనకు పరిచయం అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో అత్యద్భుతమైన చిత్రాలను తీసిన ఆయన ఆ తర్వాత ఫామ్ కోల్పోతూ వచ్చాడు. వాస్తవానికి వర్మ చిత్రాలు ఎంతో రియలిస్టిక్‌గా ఉంటాయి. రా సినిమాలను పోలి ఉంటాయి. అంటే కోలీవుడ్‌లో బాలా చిత్రాల తరహాలో తెలుగులో వర్మ చిత్రాలు ఉంటాయి.

అందులో ఎవరిదైనా బయోపిక్ తీసేటప్పుడు ఆయా పాత్రలకు తగ్గ నటీనటులను ఎంపిక చేసుకోవడంలో ఆయన శైలి వేరు. ఒరిజినల్ క్యారెక్టర్‌కు సంబంధించిన వ్యక్తుల పోలికలను సరిగ్గా పోలిన వ్యక్తులను తీసుకొని వచ్చి ఆయా చిత్రాల్లో నటింప చేస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య ఈయనకు ఆడపిల్లల పిచ్చి ఎక్కువైంది.

ఆడ వారి అందాలను పొగడటం, వారితో బోల్డ్ ఇంటర్వ్యూలు చేయడం, పోర్న్ త‌ర‌హా సినిమాలు తీసి వాటిని తన ఓటీటీలో విడుదల చేయడం.. ఇలా ఈయన తన కెరీర్‌ను తానే చెడగొట్టుకుంటూ ఉన్నారు. అసలు ఈ చిత్రాలను చేస్తుంది ఆనాటి వర్మ నేనా అనే అనుమానం చాలామందికి వస్తుందన‌డం అతిశయోక్తి కాదు. అయితే వర్మలో మరో కోణం కూడా దాగి ఉంది.

ఆయన ప్రకృతి ప్రేమికుడు. దయార్ధ్ర హృదయం కలిగిన వాడు. తాజాగా అయ‌న జంతు ప్రేమపై చేసిన ట్వీట్ పలువురు నెటిజన్లను ఆకర్షిస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్జీవికి ఉన్న ప్రకృతి ప్రేమను వ్యక్తం చేయడంతో అందరూ ఆయనను ప్రశంసిస్తున్నారు. కొన్ని సందర్భాలలో వివాదాల్లోనూ ఆయన దయార్ద్ర‌ హృదయం ప్రభావం క‌నిపిస్తూ ఉంటుంది.

అడవిలో ఓ చిరుత ఓ కోతిని నోటితో తీసుకొని వెళ్తుండగా ఆ కోతి పిల్ల ఆ కోతిని హత్తుకొని ఉన్న ఫోటోను ఆయన ట్వీట్ చేశారు. ఒకే సమయంలో ఆకలి, చావు, ప్రేమ కనిపిస్తున్నాయి. ప్రకృతి కంటే క్రూరమైనది ఏదీ లేదు అని ఆ వ‌ర్మ చేసిన ట్వీట్ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రకృతిపై వర్మకు ఇంత దయ ఉందా అని అందరూ నివ్వరబోతున్నారు. దీనిపై నెటిజన్లు పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతున్నారు.

ఆర్జీవి చెప్పిన అర్థం బాగుందని కామెంట్లు పెరుగుతున్నాయి. ఈ ట్వీట్‌లో ఆయనలోని మానవతా దృక్పథం బయటకు వస్తుందని అంటున్నారు. మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు. సందర్భాన్ని బట్టి మారుతుంటారు. అలాగే వర్మ కూడా. లేకపోతే ఆడవారి అందాలను పొగడటమే పనిగా పెట్టుకున్న వర్మ ఇలాంటి కామెంట్ చేయడమేంటి? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఈ ఫొటోలో చిరుతది ఆకలి.. కోతిది ప్రాణం.. కోతి పిల్లది ప్రేమ ఇన్ని అంశాలు ఒకే ఫొటోలో దాగి ఉన్నాయి. దాంతో ఈ విధంగా పోస్ట్ చేయడం చాలా బాగుందని అందరూ వర్మను ప్రశంసిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.