వేరే దేశంలో వరుణ్‌,లావణ్య బ్యాచిల‌ర్ పార్టీ.. పెళ్లి ఎక్క‌డ చేసుకోబోతున్నారంటే…!

  • By: sn    latest    Oct 01, 2023 12:41 PM IST
వేరే దేశంలో వరుణ్‌,లావణ్య బ్యాచిల‌ర్ పార్టీ.. పెళ్లి ఎక్క‌డ చేసుకోబోతున్నారంటే…!

మెగా హీరో వ‌రుణ్ తేజ్, అందాల ముద్దుగుమ్మ లావ‌ణ్య త్రిపాఠి సైలెంట్‌గా ప్రేమాయ‌ణం న‌డిపి జూన్‌లో నిశ్చితార్ధం జ‌రుపుకున్న విష‌యం తెలిసిందే. త్వ‌ర‌లో వీరిద్ద‌రు పెళ్లి పీట‌లెక్క‌బోతుండ‌గా, వారి పెళ్లి ఎక్క‌డ జ‌ర‌గ‌బోతుంద‌నే విష‌యం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. గ‌త కొద్ది రోజులుగా వ‌రుణ్‌-లావ‌ణ్య త్రిపాఠిల పెళ్లికి సంబంధించి అనేక ప్ర‌చారాలు సాగుతున్నా కూడా వాటిపై క్లారిటీ రావ‌డం లేదు. అయితే వ‌రుణ్ తేజ్ స్పెయిన్ లో 40 మంది తన క్లోజ్ ఫ్రెండ్స్ కు బ్యాచిలర్ పార్టీ ఇచ్చారంట. బ్యాచిలర్ లైఫ్ కు ముగింపు పలుకుతూ స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసినట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది.

ఇక ఇటలీలోని ఓ ప్యాలెస్ లో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్లి ఘనంగా జరగనున్నట్టు తెలుస్తుండ‌గా, ఇప్ప‌టికే ఇరు కుటుంబాలు పెళ్లి ప‌నుల‌లో బిజీగా ఉన్న‌ట్టు స‌మాచారం. నవంబర్ ఫస్ట్ వీక్ లోనే వీరి పెళ్లి జరగబోతుందని ప్ర‌చారాలు జ‌రుగుతుండ‌గా, దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. నిశ్చితార్థం త‌ర్వాత వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠి క‌లిసి విహార యాత్ర‌ల‌కి వెళుతున్నారు. ప‌లు ప్రాంతాల‌లో క‌లిసి క‌నిపిస్తున్నారు. వీరిద్ద‌రిని జంట‌గా చూసిన వారంద‌రు మేడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్ అంటున్నారు.

ఇక వ‌రుణ్ తేజ్ కెరీర్ విష‌యానికి వ‌స్తే చివరిగా ఎఫ్3, గని, గాండీవధారి అర్జున చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విభిన్న కథలు ఎంచుకుంటూ వస్తున్న వరుణ్ తేజ్ ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్న వ‌రుణ్ తేజ్ ఇటీవ‌ల క‌మ‌ర్షియ‌ల్‌గా స‌క్సెస్ కాలేక‌పోతున్నాడు. ఇప్పుడు ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రంతో వస్తుండగా  యాడ్ ఫిల్మ్ మేకర్ శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్నాడు.

నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా వరుణ్ తేజ్ క‌నిపించ‌నున్నాడు. డిసెంబ‌ర్ 8న ఈ చిత్రం విడుద‌ల కానుండ‌గా, ఈ సినిమాతో అయిన మంచి హిట్ కొట్టాల‌ని భావిస్తున్నారు. చిత్రంలో వరుణ్ సరసన హీరోయిన్‌గా మానుషి చిల్లర్ నటించింది. ఇక లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌స్తుతం కాస్త సినిమాలు త‌గ్గించిన‌ట్టు తెలుస్తుంది.