‘వీరయ్య’తో ‘వీరసింహారెడ్డి’ డైరెక్టర్‌.. ఏంది కథ?

విధాత‌, సినిమా: మెగాస్టార్ చిరంజీవి ‘భోళాశంక‌ర్’ త‌ర్వాతి ప్రాజెక్ట్ ఎవ‌రితో అనే దానిపై గత కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. విషయంలోకి వస్తే.. 2010లో రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డాన్ శీను చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ చిత్రం మంచి హిట్ అయింది. కానీ తర్వాత వెంకటేష్‌తో చేసిన ‘బాడీగార్డ్’ చిత్రం పెద్దగా ఆడలేదు. రవితేజ ‘బలుపు’తో హిట్ కొట్టాడు. మళ్లీ కొంత విరామం తర్వాత రామ్‌తో చేసిన ‘పండగ […]

‘వీరయ్య’తో ‘వీరసింహారెడ్డి’ డైరెక్టర్‌.. ఏంది కథ?

విధాత‌, సినిమా: మెగాస్టార్ చిరంజీవి ‘భోళాశంక‌ర్’ త‌ర్వాతి ప్రాజెక్ట్ ఎవ‌రితో అనే దానిపై గత కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. విషయంలోకి వస్తే.. 2010లో రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డాన్ శీను చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యాడు.

ఈ చిత్రం మంచి హిట్ అయింది. కానీ తర్వాత వెంకటేష్‌తో చేసిన ‘బాడీగార్డ్’ చిత్రం పెద్దగా ఆడలేదు. రవితేజ ‘బలుపు’తో హిట్ కొట్టాడు. మళ్లీ కొంత విరామం తర్వాత రామ్‌తో చేసిన ‘పండగ చేస్కో’, సాయిధరమ్ తేజ్‌తో చేసిన ‘విన్నర్’ భారీ డిజాస్టర్స్‌ని మిగిల్చాయి. మరలా రవితేజ‌తో ‘క్రాక్’ చిత్రం ద్వారా ఆయన లైమ్‌లైట్ట్‌లోకి వచ్చారు.

తాజాగా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన బాలకృష్ణ చిత్రం ‘వీరసింహారెడ్డి’తో సూపర్ హిట్ కొట్టి ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి నుంచి పిలుపు అందుకున్నాడు. ‘వీరసింహారెడ్డి’లో బాలయ్యను ఫ్యాన్స్‌కు నచ్చేలా ఆయన ప్రజెంట్ చేసిన విధానం, బాలయ్య మాస్ ఎలివేషన్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు థియేట‌ర్ల‌లో సంచ‌ల‌నం సృష్టించి బాల‌య్య అభిమానుల చేత థియేట‌ర్లు మారుమోగేలా చేశాయి.

ఈ విజయం తర్వాత గోపీచంద్ కూడా మెగాస్టార్ చిరంజీవితో చిత్రం చేయాలని ఆశపడ్డాడు. ఈ క్రమంలో గోపీచంద్ మ‌లినేని రీసెంట్‌గా చిరంజీవిని కలిశారు.

ఆయన కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన కథను వినిపించగా, చిరంజీవి సానుకూలత వ్యక్తం చేసి కొద్ది రోజుల్లో తన నిర్ణయం చెబుతానన్నారనే టాక్‌ నడుస్తోంది.

ఈ ప్రాజెక్టు దాదాపు లాక్ అయినట్టేనని గోపీచంద్ మ‌లినేని ఫుల్ ఖుషితో ఉన్నారు. చిరంజీవి కూడా ‘భోళాశంకర్’ తర్వాత ఏ సినిమాని కమిట్ కాలేదు.

‘ఛలో, భీష్మ’ చిత్రాలతో సక్సెస్ అందుకున్న వెంకీ కుడుమలకు చిరంజీవి ఓ అవకాశం ఇచ్చారు. వారి కాంబినేషన్‌లో ఓ సినిమా కూడా అనౌన్స్ అయింది.

కానీ ఆ సినిమా అనివార్య కారణాల వల్ల ఆగిపోయిందని తెలుస్తుంది. మరోవైపు పూరి, హరీష్ శంకర్ కూడా చిరు కోసం కథలు సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. కానీ ‘వీరసింహారెడ్డి’ డైరెక్టర్‌ ఏకంగా కథని వినిపించడం. చిరు నుంచి సానుకూల స్పందన రావడంతో.. ఈ ‘వీరయ్య’ తదుపరి చిత్రం ‘వీరసింహారెడ్డి’ డైరెక్టర్‌తోనే అనేలా అప్పుడే ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. చూద్దాం.. ఏం జరుగుతుందో?