Viral Video | దెయ్యం ట్రాక్టర్.. దానికదే స్టార్ట్ అయి బీభత్సం సృష్టించింది..
Viral Video | దెయ్యం ట్రాక్టర్ (Ghost Tractor) ఏంటి..? దానికదే స్టార్ట్ అవడం ఏంటని అనుకుంటున్నారా..? అవునండి ఓ ట్రాక్టర్ (Tractor) దానికదే స్టార్ట్ అయిపోయింది. ఓ షాపులోకి దూసుకొచ్చి బీభత్సం సృష్టించింది ట్రాక్టర్. దీంతో ఆ ట్రాక్టర్ను నెటిజన్లు అది దెయ్యం ట్రాక్టర్ అయి ఉండొచ్చు.. అందుకే డ్రైవర్ లేకుండానే స్టార్ట్ అయిందని ట్వీట్లు చేస్తున్నారు. కొందరేమో దాన్ని టార్జన్ ట్రాక్టర్ (Tarzan Tractor)గా పిలుస్తున్నారు. దానికదే స్టార్ట్ అయిన ట్రాక్టర్కు సంబంధించిన వీడియో […]

Viral Video | దెయ్యం ట్రాక్టర్ (Ghost Tractor) ఏంటి..? దానికదే స్టార్ట్ అవడం ఏంటని అనుకుంటున్నారా..? అవునండి ఓ ట్రాక్టర్ (Tractor) దానికదే స్టార్ట్ అయిపోయింది. ఓ షాపులోకి దూసుకొచ్చి బీభత్సం సృష్టించింది ట్రాక్టర్. దీంతో ఆ ట్రాక్టర్ను నెటిజన్లు అది దెయ్యం ట్రాక్టర్ అయి ఉండొచ్చు.. అందుకే డ్రైవర్ లేకుండానే స్టార్ట్ అయిందని ట్వీట్లు చేస్తున్నారు. కొందరేమో దాన్ని టార్జన్ ట్రాక్టర్ (Tarzan Tractor)గా పిలుస్తున్నారు. దానికదే స్టార్ట్ అయిన ట్రాక్టర్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని బిజ్నోర్ ఏరియాలో ఓ దుకాణానికి ఎదురుగా రోడ్డు అవతలి వైపు ట్రాక్టర్ను ఆపి ఉంచారు. అయితే ఆ ట్రాక్టర్ ఉన్నట్టుండి ముందుకు కదిలింది. డ్రైవర్ లేకుండానే ట్రాక్టర్ స్టార్ట్ అయి ఎదురుగా ఉన్న దుకాణంలోకి దూసుకొచ్చింది. షాపు ముందున్న ఓ బైక్, సైకిల్ ధ్వంసం అయ్యాయి. దుకాణానికి అమర్చిన గాజు కూడా పగిలిపోయింది.
షాపులోకి దూసుకొస్తున్న ట్రాక్టర్ను ఆపేందుకు క్యాష్ కౌంటర్లో ఉన్న వ్యక్తి ప్రయత్నించాడు. భయంతో అతను బయటకు పరుగెత్తాడు. మరో వ్యక్తి వచ్చి ట్రాక్టర్ బ్రేక్లను తన చేతితో నొక్కి పట్టాడు. దీంతో ట్రాక్టర్ ఆగిపోయింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
Viral Video | దెయ్యం ట్రాక్టర్.. దానికదే స్టార్ట్ అయి బీభత్సం సృష్టించింది.. | Vidhaatha | Latest Telugu News https://t.co/qOmrV9c6Ql #viral #viralvideo #ViralVideos #ghost #ghosts pic.twitter.com/xrni8dl8Jk
— vidhaathanews (@vidhaathanews) March 4, 2023
ఈ వీడియోను ప్రీతి పాండే భరద్వాజ్ అనే ఓ మహిళా జర్నలిస్టు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 2004లో హిందీ భాషలో వచ్చిన టార్జాన్: ది వండర్ కారుతో ఈ ట్రాక్టర్ను పోల్చుతున్నారు నెటిజన్లు. ఆ ట్రాక్టర్ దానికదే ఎలా స్టార్ట్ అయ్యింది అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఘోస్ట్ (దెయ్యం) ట్రాక్టర్ అని కొందరు పేర్కొన్నారు.
View this post on Instagram