Jangaon | వీఆర్‌ఏ సంధ్య ఆత్మహత్య
Jangaon విధాత, వరంగల్: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలకేంద్రానికి చెందిన వీఆర్ఏ దేవరాయ అలియాస్ మానుపాటి సంధ్యా కిరణ్ గురువారం ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. ఘటన కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాలివి. సంధ్యా కిరణ్ మొన్నటి వరకు లింగాలగణపురం రెవెన్యూ కార్యాలయంలో వీఆర్ఏగా పనిచేసేవారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏలకు ఉద్యోగోన్నతి కల్పిస్తూ వివిధ శాఖల్లో సర్దుబాటు చేసింది. ఇందులో భాగంగా మేడ్చల్ జిల్లాకు ఈమె బదిలీ అయ్యారు. ప్రతిరోజు రఘునాథపల్లి నుంచి హైదరాబాదు మేడ్చల్ […]

Jangaon
విధాత, వరంగల్: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలకేంద్రానికి చెందిన వీఆర్ఏ దేవరాయ అలియాస్ మానుపాటి సంధ్యా కిరణ్ గురువారం ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. ఘటన కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాలివి. సంధ్యా కిరణ్ మొన్నటి వరకు లింగాలగణపురం రెవెన్యూ కార్యాలయంలో వీఆర్ఏగా పనిచేసేవారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏలకు ఉద్యోగోన్నతి కల్పిస్తూ వివిధ శాఖల్లో సర్దుబాటు చేసింది.
ఇందులో భాగంగా మేడ్చల్ జిల్లాకు ఈమె బదిలీ అయ్యారు. ప్రతిరోజు రఘునాథపల్లి నుంచి హైదరాబాదు మేడ్చల్ కు అప్ అండ్ డౌన్ చేస్తూ విధులు నిర్వహిస్తుండేది. భర్త శ్రీనివాస్ సూరత్ లో పనిచేస్తున్నాడు. వీరికి ఐదేళ్ల కుమారుడు యశ్వంత్, మూడేళ్ల పాప హర్షిత ఉన్నారు. ఒత్తిడి కారణంగా విషద్రావకం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఘటనకు కారణాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది