ఈ కథ జస్ట్ బిలో యావరేజ్: మెగాస్టార్

నిర్మాతలు బాగుంటేనే అందరూ బాగుంటారు విధాత: నాటి కాలంలో సినిమాల నిర్మాణంలో దర్శక నిర్మాతల‌ మాటలకు, వారి నిర్ణయాలకు ఓ విలువ ఉండేది. కానీ నేడు స్టార్ హీరోలతో చిత్రాలు చేసేటప్పుడు వారి ప్రమేయం ఏమీ ఉండదు. కేవలం ఆయా స్టార్ హీరోలు చెప్పినట్లుగా మార్పులు చేర్పులు చేసి వారు చెప్పిన హీరోయిన్ ఇతర ఆర్టిస్టులను పెట్టుకోవడం తోటే అందరూ రాజీ పడుతున్నారు. దాసరి నారాయణరావు చెప్పినట్టు సినిమాకు రెండు కళ్ళు దర్శకనిర్మాతలు. నేడు నిర్మాతలు కేవలం […]

  • Publish Date - January 15, 2023 / 11:16 AM IST

నిర్మాతలు బాగుంటేనే అందరూ బాగుంటారు

విధాత: నాటి కాలంలో సినిమాల నిర్మాణంలో దర్శక నిర్మాతల‌ మాటలకు, వారి నిర్ణయాలకు ఓ విలువ ఉండేది. కానీ నేడు స్టార్ హీరోలతో చిత్రాలు చేసేటప్పుడు వారి ప్రమేయం ఏమీ ఉండదు. కేవలం ఆయా స్టార్ హీరోలు చెప్పినట్లుగా మార్పులు చేర్పులు చేసి వారు చెప్పిన హీరోయిన్ ఇతర ఆర్టిస్టులను పెట్టుకోవడం తోటే అందరూ రాజీ పడుతున్నారు.

దాసరి నారాయణరావు చెప్పినట్టు సినిమాకు రెండు కళ్ళు దర్శకనిర్మాతలు. నేడు నిర్మాతలు కేవలం ఒక ఏటీఎం మిషన్ల లాగా పని చేస్తున్నారు. అడిగిన డబ్బులు ఇవ్వడం మాత్రమే వారి పని. దేంట్లోనూ వారికి ప్రమేయం ఉండదు. తాజాగా ఇదే విషయమై మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్లో మాట్లాడారు.

పరిశ్రమ మంచి కోరుతూ నిర్మాతల‌ డబ్బులను వృధా చేయవద్దని దర్శకులకు హితబోధ చేశారు. ఓ సినిమాకు అప్పటికప్పుడు ఏదో అనుకొని విపరీతంగా ఖర్చు పెట్ట‌డం స‌రికాదు. ముందుగా సినిమాకు కావలసినవన్నీ పేపర్ వర్క్ లోనే పూర్తి చేయాలని ద‌ర్శ‌కుల‌కు సూచించారు. నిర్మాతలు బాగుంటేనే నటీనటులు బతుకుతారని ఆయన మరోసారి అందరికీ హిత‌వు పలికారు.

వాల్తేరు వీరయ్య విజయంతో నా మాటలు కొరవడ్డాయి. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. మనం మాట్లాడటం ఆపేసి ప్రేక్షకుల మాటలు విందాం. ప్రేక్షకుల ఉత్సాహమే మనకు ఇంధనం. నేను కష్టపడలేదు నా బాధ్యతగా అనుకొని పనిచేశా. కష్టం నాది.. రవితేజ ది కాదు. సినిమా బాగా రావాలని పనిచేసిన వారిది. ఈ పని చేసిన సినీ కార్మికులది. బాబీ క‌థ అందరికీ నచ్చింది. ఆ తర్వాత బాబిని పర్సనల్ గా నా రూమ్ కి తీసుకుని వెళ్ళా.

ఈ కథ జస్ట్ బిలో యావరేజ్. ఇది ఒక ముడి వజ్రం. దీంతో మనం ఏం చేయలేం. దీన్ని మనం అందమైన ఆభరణంగా మార్చాలి. నువ్వు స్క్రిప్ట్ పూర్తి చేసి ప్రతిసారి నాకు చెప్పు. నచ్చితే ముందుకు వెళ్దాం.. లేకపోతే మార్పులు చేద్దాం అని చెప్పాను. అనుకున్నట్టే బాబి పలు మార్పులు చేర్పులు చేశారు. నేను చెప్పిన సూచనలను కూడా తీసుకున్నారు.

44 ఏళ్ల నా ఇండస్ట్రీ అనుభవాన్ని గౌరవించారు. ఈగోకి పోకుండా మేము చెప్పిన మార్పులు చేర్పులను అందంగా మలిచారు. ప్రతి సీనును సంపూర్ణంగా తయారు చేశారు. కోర్టులో ప్రకాష్ రాజ్ తల నర‌క‌డానికి బలమైన కారణం నాకు కనపడలేదు. అదే చెప్పాను. తల నరికేంత కోపం రావాలంటే ఇంకా ఏదో బలమైన కారణం ఉండాలి అని చెప్పాను. చివరకు ఆ మార్పులు చేశాం. అతనికి కన్విన్స్ అవ్వడమే కాదు కన్విన్స్ చేయడం తెలుసు. బాబిలో ఉన్న గొప్పతనం. వృధా సీన్స్ ఉంటే ఆ పేపర్లను చించి పారేసేవాడు. అనవసర సీన్స్ తో నిర్మాతల డబ్బులను వృధా చేయవద్దని చెప్పాను.

మా సినిమా అరగంట ఎడిటింగ్ రూమ్ లో పక్కన పడేశాం అనే మాటలు వింటూనే ఉన్నాం. కానీ మా సినిమాకు 7 నిమిషాలు మహా అయితే పది నిమిషాలు పక్కన పెట్టాం. యాక్షన్ సన్నివేశాలు ఎక్కువ తీశాం తప్ప నిర్మాతలకు నయా పైసా వృధా కాలేదు. నేడు దర్శకులు ఎక్కువ నిడివి వస్తే వాటిని పార్ట్ 2గా మలుచుకోగలుగుతున్నారు. పోనియన్ సెల్వ‌న్‌, బాహుబలి వంటివి దీనికి ఉదాహరణ. అయినా నేను ఇది ఎవరిని ఉద్దేశించి అనడం లేదు.

కొత్త టెక్నాలజీ వాడి పనితనం చూపించే కంటే కథ నమ్మి సాధారణ కెమెరాతోను గొప్ప సినిమా తీయాలి. ఏదైనా అవసరం మేరకు తీసుకోవాలి. ఏదేమైనా నిర్మాతలు బాగుండాలి. వాళ్ళు బాగుంటేనే మళ్ళీ సినిమాలు చేస్తారు. నా తమ్ముడు రవితేజ లేకుండా ఉండుంటే ఈ సినిమా సెకండ్ హాఫ్ ఇంత అందంగా వచ్చేది కాదు. ప్రేక్షకులకు మన థాంక్స్ చెప్పక్కర్లేదు. మంచి సినిమా ఇచ్చేందుకు వాళ్లే థాంక్స్ చెప్తున్నారని చిరంజీవి చెప్పుకొచ్చారు.