వరంగల్‌: మరో SI సస్పెన్షన్.. వరుస ఘ‌ట‌న‌తో పోలీసుల్లో వణుకు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ కమిషనరేట్ పరిధిలో మరో పోలీస్ ఆఫీసర్ పై వేటు పడింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఎస్సైని సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే ఎన్.రాజారావు నల్లబెల్లి సబ్ ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్నాడు. ఈయనపై అవినీతి ఆరోపణలు రావడంతో సీపీ ఏ.వీ రంగనాథ్ విచారణ చేపట్టారు. అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో గురువారం సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ముగ్గురు సీఐలు, ముగ్గురు ఎస్ ఐలను […]

  • Publish Date - February 9, 2023 / 02:41 PM IST

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ కమిషనరేట్ పరిధిలో మరో పోలీస్ ఆఫీసర్ పై వేటు పడింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఎస్సైని సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే ఎన్.రాజారావు నల్లబెల్లి సబ్ ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్నాడు.

ఈయనపై అవినీతి ఆరోపణలు రావడంతో సీపీ ఏ.వీ రంగనాథ్ విచారణ చేపట్టారు. అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో గురువారం సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ముగ్గురు సీఐలు, ముగ్గురు ఎస్ ఐలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

వరుస సస్పెన్షన్లతో కమిషనరేట్ పరిధిలోని పోలీసులలో ఆందోళన నెలకొంది. తదుపరి వేటు ఎవరిపై పడుతుందోననే చర్చ పోలీసు వర్గాల్లో సాగుతోంది.