Warangal: గులాబీ డబుల్ ఇంజన్.. కేంద్రంలో, రాష్ట్రంలో మన పాలనే: మంత్రి ఎర్రబెల్లి

గుజరాత్ కాదు… తెలంగాణ మోడల్ రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు తిరుగులేదు ప్రతిపక్షాలకు జనాదరణ లేదు మంత్రి ఎర్రబెల్లి ఆశాభావం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: దేశానికి కావాల్సింది గులాబీ డబుల్ ఇంజన్ సర్కారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో మన పాలనే ఉండాలి. అప్పుడే రాష్ట్రం, దేశం అద్భుతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని ధర్మపురంలో గురువారం జరిగిన బీఆర్ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ఇప్పుడు దేశానికి […]

  • Publish Date - April 20, 2023 / 03:11 PM IST
  • గుజరాత్ కాదు… తెలంగాణ మోడల్
  • రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు తిరుగులేదు
  • ప్రతిపక్షాలకు జనాదరణ లేదు
  • మంత్రి ఎర్రబెల్లి ఆశాభావం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: దేశానికి కావాల్సింది గులాబీ డబుల్ ఇంజన్ సర్కారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో మన పాలనే ఉండాలి. అప్పుడే రాష్ట్రం, దేశం అద్భుతంగా అభివృద్ధి చెందుతుందన్నారు.

పాలకుర్తి నియోజకవర్గంలోని ధర్మపురంలో గురువారం జరిగిన బీఆర్ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ఇప్పుడు దేశానికి గుజరాత్ మోడల్ కాదు… అది ఫెయిల్ అయింది. తెలంగాణ మోడల్ దేశ వ్యాప్తం కావాలి. తెలంగాణ దేశంలో అన్ని రంగాల్లో ముందుందటమే ఇందుకు నిదర్శనమన్నారు.

రాష్ట్రంలో బి ఆర్ ఎస్‌కు తిరుగులేదు. తెలంగాణలో ప్రతిపక్షాలకు జనాదరణ లేదు. కావాల్సింది దేశానికి కెసిఆర్ మార్గదర్శనం. దేశం ఆయన కోసం ఎదురు చూస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.