Warangal
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రతిపక్ష పార్టీలు ఎవరైనా మీ ప్రాంతానికి వస్తే వారిని రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మీరు పాలించే రాష్ట్రాల్లో అమలవుతున్నాయా అంటూ ప్రశ్నించండని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ వీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ కేడర్ కు ఉద్భోదించారు.
హనుమకొండలో శుక్రవారం జరిగిన బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి వినయ్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
వినయ్ మాట్లాడుతూ నగరం వరదలతో మునిగిపోయిన సందర్భాల్లో ఏ పార్టీ ముందుకు రాలేదని ప్రజలను ఆదుకున్న ఘనత మాదేనని అన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం ఎమ్మెల్యేగా రాజీనామా చేయి అంటే రాజీనామా చేసానని అన్నారు. ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమంతో ముందుకు సాగుతున్నామని అన్నారు.
మాజీ ఉపముఖ్య మంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా బిజెపి మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల సవితి తల్లి ప్రేమ చూపిస్తుందని అన్నారు. జరగబోయే శాసనసభ ఎన్నికలలో పార్టీ కార్యకర్తలు ప్రజలందరూ కూడా సమన్యాయంతో పనిచేయాలని అన్నారు.
రాష్ట్రంలో ఉన్న దళితులకు దళిత బంధు ఏర్పాటు చేసుకున్నామని సూచించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. బిజెపి, కాంగ్రెస్ నాయకులకు దళితులపై ప్రేమ ఉంటే ఎందుకు దళిత బంధు అమలు చేయాలేదన్నారు.
నేనున్నా అంటూ మీ మధ్యలో తిరిగే మీ ఆత్మీయ నాయకుడు దాస్యం వినయ్ భాస్కర్ ను ఐదవ సారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కోరారు.
కార్యక్రమంలో కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, బిఆర్ఎస్ నాయకులు తాళ్లపెళ్లి జనార్దన్ గౌడ్, పులి రజిని కాంత్, నయీమ్ పాషా, దర్శన్ సింగ్, వేముల శ్రీనివాస్, చీకటి శారదా ఆనంద్, బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.