ఈ వారం రాశి ఫ‌లాలు (05.02.2023 నుంచి 11.02 2023 వరకు)

మేష రాశి : - చేయవలసిన పనులకు ఆటంకాలు ఎదుర‌వుతాయి. వివాహ ప్రయత్నాలు నెమ్మదిస్తాయి. శరీరములో వేడి చేయుట వలన బలహీనత వుండవచ్చును. కటుంబములో అశాంతి కలుగవచ్చును. నిందలను వినవలసి వస్తుంది. క్రీడాకారులను శరీర గాయాలు బాధిస్తాయి. సుబ్రహ్మణ్య ఆరాధన శుభములనిస్తుంది. వృషభ రాశి : - పెద్దలతో విరోధములు ఏర్పడవచ్చును. భావోద్వేగానికి లోనయ్యే అవ‌కాశం ఉంది. ప్రయత్న కార్యములు నిరుత్సాహపరుస్తాయి. ఇతరులను కష్ట పెట్టే పనులకు దూరంగా వుండే ప్రయత్నం చేయండి. వ్యసనాల మూలంగా మనస్తాపానికి లోనయ్యెదరు. […]

ఈ వారం రాశి ఫ‌లాలు (05.02.2023 నుంచి 11.02 2023 వరకు)

మేష రాశి : – చేయవలసిన పనులకు ఆటంకాలు ఎదుర‌వుతాయి. వివాహ ప్రయత్నాలు నెమ్మదిస్తాయి. శరీరములో వేడి చేయుట వలన బలహీనత వుండవచ్చును. కటుంబములో అశాంతి కలుగవచ్చును. నిందలను వినవలసి వస్తుంది. క్రీడాకారులను శరీర గాయాలు బాధిస్తాయి. సుబ్రహ్మణ్య ఆరాధన శుభములనిస్తుంది.

వృషభ రాశి : – పెద్దలతో విరోధములు ఏర్పడవచ్చును. భావోద్వేగానికి లోనయ్యే అవ‌కాశం ఉంది. ప్రయత్న కార్యములు నిరుత్సాహపరుస్తాయి. ఇతరులను కష్ట పెట్టే పనులకు దూరంగా వుండే ప్రయత్నం చేయండి. వ్యసనాల మూలంగా మనస్తాపానికి లోనయ్యెదరు. శ్రీరామచంద్రస్వామి ఆరాధన మనశ్శాంతినిస్తుంది.

మిథున రాశి : – ఉద్రేకము వలన పనులు చెడిపోతాయి. దుష్ట్ర‌వర్తనకు పశ్చాత్తాపాన్ని పొందుతారు. పై అధికారుల దగ్గర నమ్మకాన్ని కోల్పోతారు. ప్రయాణ మూలకంగా బాధలు, వృథా ధనవ్యయము క‌లుగుతాయి. మనస్సులోని చికాకుల మూలకంగా బంధు విరోధం ఏర్పడుతుంది. ల‌లితా ఆరాధన శుభాన్నిస్తుంది.

కర్కాటక రాశి :- వివాహ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వివాదాలను పరిష్కరించుకుంటారు. ప్రముఖుల ఆదరణ లభిస్తుంది. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. ఋణములను తీర్చుట వలన మనోల్లాసము కలుగుతుంది. గణపతి ఆరాధన మరింత శుభాల‌ను కలిగిస్తుంది.

సింహ రాశి :- బకాయిపడ్డ పాత బాకీలు వసూలవుతాయి. శతృవులు మిత్రులౌతారు. ప్రభుత్వ సంబంధ పనులు కొంతవరకు సఫలీకృతమౌతాయి. విద్యార్థులు కొత్త విషయాలను తెలుసుకుంటారు, రాజకీయ రంగంలోని వారికి ప్రజాభిమానము సంతోషాన్నిస్తుంది. సుబ్రహ్మణ్య ఆరాధన వలన కార్యసిద్ధి కలుగుతుంది.

కన్యా రాశి :- పని ఒత్తిడి వలన అకారణ కలహము లేర్పడుతాయి. కుటుంబసభ్యులతో అపాధర్లు కలుగుతాయి. ఆదాయనికి మించిన ఖర్చులుంటాయి. పితృవర్గము వారితో విభేదాలు ఏర్పడవచ్చును. భోజనముపై ఆసక్తి వుండదు. జ్వరముతో శరీరము నీరసముగా వుండవచ్చును. విష్ణు ఆరాధన ఉపశమనాన్నిస్తుంది.

తులా రాశి :- మాటలలో వైరాగ్యం గోచరిస్తుంది. భయం మూలకంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఋణ మూలకంగా అశాంతి కలుగుతుంది. ఆకస్మిక ఖర్చులు ఎదురౌతాయి. ప్రయాణాలతో అసౌకర్యము కలుగుతుంది. తలపెట్టిన కార్యములకు ఆటంకాలు ఎదురౌతాయి. నృసింహస్వామి ఆరాధన మనో ధైర్యాన్నిస్తుంది.

వృశ్చిక రాశి :- కార్యసాధనకై కోపాన్ని ప్రదర్శించవలసి వస్తుంది. కొన్ని దైవసంబంధ కార్యక్రమములకు బాధ్యత వహించవలసి వస్తుంది. నూతన కార్యారంభమునకు అనుకూలము. ఉద్యోగార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తుల క్రయవిక్రయముల వలన మనోల్లాసము కలుగుతుంది. సుబ్రహ్మణ్య సత్ఫలితాలనిస్తుంది.

ధనుస్సు రాశి :- కోల్పోయిన వస్తువులు తిరిగి సంపాదించుకుంటారు. చర్చలలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. పరోపకారముతో గౌరవాన్ని పొందుతారు. ధనముతోపాటు సంతృప్తి కూడా లభిస్తుంది. కుటుంబ సమస్యలు చక్కబ‌డ‌తాయి. నూతన ఒప్పందాలకు అనుకూలము. దత్తాత్రేయ ఆరాధన మేలు చేస్తుంది.

మకర రాశి :- శరీర బలహీనత, వృథా కలహాలతో మనోవ్యాకులము కలుగుతుంది. కోపం వలన పనులు విఫలమవుతాయి. శ్రమ ఎక్కువౌతుంది. వివాహ ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రుల మూలకంగా అశాంతి ఏర్పడుతుంది. గణపతి ఆరాధన చిక్కులని దూరం చేస్తుంది.

కుంభ రాశి :- ఆశించిన ఫలితాలు రాక అసంతృప్తికి లోనవుతారు. వ్యాపారులు తమ వస్తువుల భద్రతపై శ్రద్ధ వహించాలి. వస్తునష్టములు కనిపిస్తున్నాయి. సన్నిహితులను నమ్మక పోవడం వలన ఇబ్బంది కలిగిస్తారు. ఒళ్ళునొప్పులు, ఉదర సంబంధమైన బాధలు వుండవచ్చును. సుదర్శన ఆరాధన వలన చిక్కులు తొలగుతాయి.

మీన రాశి :- అక్కాచెల్లెళ్ళకు ఆసరాగా నిలుస్తారు. రాజకీయనాయకులు తమ ప్ర‌య‌త్నాల‌లో సఫలీకృతులౌతారు. సత్ప్రవర్తనతో గౌరవాన్ని పొందుతారు. ఉద్యోగులు కొత్త బాధ్యతలను నిర్వర్తిస్తారు. మొండి బకాయిలు వసూలవ‌డంతో ధనలాభము వుంటుంది. వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆంజనేయస్వామి ఆరాధాన మేలు చేస్తుంది.

– తూండ్ల కమలాకర శర్మ సిద్ధాంతి, కూకట్‌పల్లి, హైదరాబాద్, 6304230960