Stormy Daniels | ట్రంప్‌ పెంట్‌హౌస్‌లో.. ఏం జరిగింది? శృంగార తార చెప్పిన ముచ్చట్లు!

ఎవరీ స్ట్రామీ డేనియల్స్‌.. అ తర్వాత జరిగిన పరిణామాలేంటి? విధాత: 2016 ఎన్నికల్లో లేనిపోని రాద్ధాంతం ఎందుకని ఒక బుతు సినిమాల తార స్ట్రామీ డేనియల్స్‌కు భారీ మొత్తంలో సొమ్ము రహస్యంగా ముట్టజెప్పడం ట్రంప్‌పై అభియోగాల నమోదుకు దారి తీసింది. అసలు ఈ స్ట్రామీ డేనియల్స్‌ (Stormy Daniels) ఎవరు? ప్రస్తుత వివాదానికి మూల కారణంగా చెబుతున్న 2006లో ట్రంప్‌ పెంట్‌హౌస్‌లో ఏం జరిగింది? ట్రంప్‌ టీవీ షోలు చేసిన సమయంలో తాను 2006 సంవత్సరంలో ఆయనతో […]

  • Publish Date - March 31, 2023 / 06:14 PM IST

  • ఎవరీ స్ట్రామీ డేనియల్స్‌..
  • అ తర్వాత జరిగిన పరిణామాలేంటి?

విధాత: 2016 ఎన్నికల్లో లేనిపోని రాద్ధాంతం ఎందుకని ఒక బుతు సినిమాల తార స్ట్రామీ డేనియల్స్‌కు భారీ మొత్తంలో సొమ్ము రహస్యంగా ముట్టజెప్పడం ట్రంప్‌పై అభియోగాల నమోదుకు దారి తీసింది. అసలు ఈ స్ట్రామీ డేనియల్స్‌ (Stormy Daniels) ఎవరు? ప్రస్తుత వివాదానికి మూల కారణంగా చెబుతున్న 2006లో ట్రంప్‌ పెంట్‌హౌస్‌లో ఏం జరిగింది?

ట్రంప్‌ టీవీ షోలు చేసిన సమయంలో తాను 2006 సంవత్సరంలో ఆయనతో సెక్స్‌లో పాల్గొన్నానని డేనియల్స్‌ చెబుతున్నది. ట్రంప్‌ మాత్రం అదంతా వట్టి అబద్ధమని, తాను ఆమెతో కలవలేదని కుండబద్దలు కొడుతున్నారు. డబ్బు గుంజుకునేందుకు ఆమె చేస్తున్న తప్పుడు ఆరోపణలు ఆపేందుకే తాను డబ్బు చెల్లించానని చెబుతున్నారు.

ఎవరీ స్ట్రామీ డేనియల్స్‌

స్ట్రామీ డేనియల్స్‌ అడల్ట్‌ ఫిల్మ్‌ స్టార్‌. ఆమె అసలు పేరు స్టెఫనీ క్లిఫోర్డ్‌. ప్రస్తుతం ఆమె వయసు 44 సంవత్సరాలు. దాదాపు రెండు దశాబ్దాలపాటు పోర్న్‌ ఇండస్ట్రీలో ఉన్నారు. అనేక చిత్రాల్లో నటించడమే కాకుండా.. దర్శకత్వం కూడా వహించారు. ఒక టెలివిజన్‌ షోలో అప్పటి సంగతులను ఆమె పంచుకున్నారు. ‘లేక్‌ థాహోలో జరిగిన ఒక సెలెబ్రిటీ గోల్ఫ్‌ టోర్నమెంట్‌లో ట్రంప్‌తో పరిచయం కలిగింది.

ట్రంప్‌ ఆహ్వానం మేరకు హోటల్‌లోని ఆయన సూట్‌లో భోజనం చేశాం. అక్కడ ట్రంప్‌ కవర్‌ పేజీతో ఉన్న ఒక గోల్ఫ్‌ మ్యాగజైన్‌ను చూపించాడు. ఎవరైనా వచ్చి ఆ మ్యాగజైన్‌ను పట్టుకుని ఆయన నడ్డి మీద తన్నితే బాగుండు అనుకున్నాను. ఆ తర్వాత అతడు నా ముందుకు తిరిగి.. తన ప్యాంటును కొంచెం కిందికి జార్చాడు. లోపల అండర్‌వేర్‌ వేసుకుని ఉన్నాడు. నేను రెండు మూడుసార్లు తట్టాను. నా గురించి అడిగాడు.

సెలెబ్రిటీ అప్రెంటిస్‌ షోలో పాల్గొనేందుకు ఇష్టమేనా అని అడిగాడు. నన్ను గొప్ప అందగత్తె అని పొగిడాడు. నేనంటే చాలా ఇష్టం అన్నాడు. ఇప్పుడే వస్తానని చెప్పి వాష్‌రూమ్‌కు వెళ్లాను. తిరిగి వచ్చేసరికి బెడ్‌కు అవతలివైపు కూర్చున్నాడు. విషయం అర్థమైంది. ఇద్దరం ఇష్టపూర్వకంగానే కలిశాం’ అని వివరించింది.

ఓ ఏడాది తర్వాత ట్రంప్‌ తనకు పోన్‌ చేశాడని, ఆయన కోరిక మేరకు 2007 జూలైలో లాస్‌ ఏంజలీస్‌లోని బేవర్లీ హిల్స్‌ హోటల్‌లో కలిసి.. సెలెబ్రిటీ అప్రెంటిస్‌ ప్రోగ్రాంలో తాను పాల్గొనడంపై చర్చించామని డేనియల్స్‌ తెలిపింది. ‘ఆ సమయంలో మరోసారి సెక్స్‌ చేయాలని కోరాడు. నేను తిరస్కరించాను. ఒక నెల తర్వాత ట్రంప్‌ ఫోన్‌ చేసి.. టెలివిజన్‌ షోలో నన్ను బుక్‌ చేయడం లేదని చెప్పాడు’ అని డేనియల్స్‌ వివరించింది.

ఆ సంబంధంపై మాట్లాడకూదని ఒప్పందం

2016 అక్టోబర్‌ 28న.. అంటే ట్రంప్‌ గెలిచిన ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న సమయంలో డేనియల్స్‌ ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ట్రంప్‌తో తన సంబంధాలపై బహిరంగంగా మాట్లాడకూడదని, అందుకు 130000 డాలర్లు ట్రంప్‌ చెల్లిస్తారనేది ఆ ఒప్పందం సారాంశం. ఈ ఒప్పందంపై ఆ సమయంలో డేనియల్స్‌ లాయర్‌ కెయిత్‌ డేవిడ్‌సన్‌, ట్రంప్‌ వ్యక్తిగత న్యాయవాది మైఖేల్‌ కొహెన్‌ సంతకాలు చేశారు.

అదే ఒప్పంద పత్రంలో ట్రంప్‌ సంతకం చేసేందుకు ఒక స్థలం ఖాళీగా వదిలారు. ఇప్పటి వరకూ దానిపై ఆయన సంతకం చేయలేదు. 2018లో వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఈ గుట్టును బయటపెట్టినప్పడు ఈ సొమ్మును తన వ్యక్తిగత ఖాతా నుంచి డేనియల్స్‌కు చెల్లించానని, అంతేకానీ ట్రంప్‌ ఆదేశాల మేరకు కాదని బహిరంగంగానే చెప్పాడు.

ట్రంప్‌ను అరెస్టు చేస్తారా?

కోర్టు ఆదేశాల మేరకు ట్రంప్‌ లొంగిపోతారని ఆయన తరఫు న్యాయవాదులు వెల్లడించారు. అయితే.. తాము ఈ విషయంలో తీవ్ర స్థాయిలో న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తనపై అభియోగాలు నమోదు చేయడం రాజకీయ దురుద్దేశపూరితమని, తన ఎన్నిక విషయంలో జోక్యం చేసుకోవడమేనని ట్రంప్‌ మండిపడ్డారు. మన్‌హట్టన్‌ జిల్లా అటార్నీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తరఫున చెత్త పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖూనీకోరులను, దోపిడీ దొంగలను వదిలేసి.. తనను పట్టకున్నారని మండిపడ్డారు.

ఇప్పుడేం జరుగుతుంది?

అమెరికాకు 45వ అధ్యక్షుడిగా వ్యవహరించిన ట్రంప్‌.. తనపై వచ్చిన అభియోగాలను మన్‌హట్టన్‌లోని న్యూయార్క్‌ స్టేట్‌ సుప్రీం కోర్టులో ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అధికారులు ఆయన వేలి ముద్రలు సేకరించడంతోపాటు.. ఫొటోలు తీస్తారు. అయితే, ఆయన చేతికి సంకెళ్లు వేసి, నడిపించే అవకాశాలు ఉండవని కోర్టు వర్గాలు చెబుతున్నాయి

Latest News