సోమేశ్ కుమార్ భవితవ్యం..? తెలంగాణలో పాగా వేస్తారా?

కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయా ! విధాత‌: ఉన్నతాధికారులు ఉద్యోగంలో ఉన్నన్నాళ్లు ఫర్వాలేదు అధికారం..హోదా.. ప్రోటోకాల్స్ అన్నీ ఉంటాయి.. కానీ రిటైర్ అయ్యాక వారు అదే రీతిలో జీవించడం సాధ్యం కాదు.. హోదా.. ప్రోటోకాల్స్.. పరిచారికలు ఎవరూ ఉండరు.. కానీ అవన్నీ లేకుండా సాధారణ పౌరుల్లా వారు జీవించలేరు.. అందుకే రిటైర్మెంట్ తరువాత కూడా ఏదో ప్రభుత్వంలో ఏదో హోదాలో కొనసాగుతూనే ఉంటుంటారు. ఆంధ్రాలో అజయ్ కళ్ళం.. నీలం సహాని తదితరులు ఉండగా తెలంగాణలో బోలెడు మంది ఉన్నారు. […]

  • Publish Date - February 17, 2023 / 01:21 PM IST
  • కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయా !

విధాత‌: ఉన్నతాధికారులు ఉద్యోగంలో ఉన్నన్నాళ్లు ఫర్వాలేదు అధికారం..హోదా.. ప్రోటోకాల్స్ అన్నీ ఉంటాయి.. కానీ రిటైర్ అయ్యాక వారు అదే రీతిలో జీవించడం సాధ్యం కాదు.. హోదా.. ప్రోటోకాల్స్.. పరిచారికలు ఎవరూ ఉండరు.. కానీ అవన్నీ లేకుండా సాధారణ పౌరుల్లా వారు జీవించలేరు.. అందుకే రిటైర్మెంట్ తరువాత కూడా ఏదో ప్రభుత్వంలో ఏదో హోదాలో కొనసాగుతూనే ఉంటుంటారు.

ఆంధ్రాలో అజయ్ కళ్ళం.. నీలం సహాని తదితరులు ఉండగా తెలంగాణలో బోలెడు మంది ఉన్నారు. మరిప్పుడు వివాదాస్పదంగా కోర్టు వెల్లగొట్టడంతో తెలంగాణ నుంచి ఆంధ్ర వచ్చి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చిన సోమేశ్ కుమార్ తాజాగా స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.

తెలంగాణలో అపరిమిత అధికారాలు అనుభవించి ఆంధ్రాలో కిందికి దిగి వేరే పోస్టులో కొనసాగడం ఇష్టం లేక రాజీనామా చేశారని అంటుండగా దానికి ముఖ్యమంత్రి ఆమోదం కూడా అయిందని అంటున్నారు. మరి తరువాత కథ ఏమిటి.. కేసీఆర్‌కు అత్యంత ముఖ్యుడు.. ఆంతరంగికుడుగా వెలిగిన సోమేశ్ కుమార్ ఇప్పుడు ఏమి చేస్తారు.

తెలంగాణలో అయితే కోల్ ఇండియా చైర్మన్‌గా పని చేసి రిటైర్ అయిన నర్సింగరావుతో బాటు
భూపాల్ రెడ్డి.. రాజశేఖర్ రెడ్డి తదితరులు ఇంకా కేసీఆర్ ఆశీస్సులతో అక్కడే కార్యదర్శులుగా ఉన్నారు. మాజీ డీజీపీ పేర్వారం రాములు కూడా రిటైర్మెంట్ తరువాత టూరిజం కార్పోరేషన్ చైర్మన్‌గా పని చేశారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రాజీవ్ శర్మ, మాజీ డీజీపీ అనురాగ్ శర్మ.. ఇంకో ఐపీఎస్
ఏకే ఖాన్.. ఐఏఎస్ రమణాచారి కూడా రిటైర్ అయ్యాక సలహాదారులుగా చేరారు.

అయితే ఈ జాబితాలో మొన్న రిటైర్ అయిన డీజీపీ మహేందర్ రెడ్డిని మాత్రం ఎక్కడా పోస్టింగులోకి తీసుకోలేదు. మరి మహేందర్ రెడ్డి కేసీఆర్‌కు నచ్చలేదో ఏమో.. అది సరేగాని ఇప్పుడు సోమేశ్ కుమార్‌ను కూడా ఏదో పెద్ద పోస్టులో నియమిస్తారా.. సలహాదారుగా చేస్తారా.. అన్నది ఇంకా క్లారిటీ లేదంటున్నారు. అయినా వడ్డించేవాడు మనవాడు అయితే ఎక్కడ కూచున్నా మన ఐటమ్స్ మనకు వస్తాయి.