WhatsApp Features | వాట్సాప్‌లో ఈ ఫీచర్ల గురించి తెలుసా..? మీరూ ట్రై చేయండి..! వావ్‌ అనాల్సిందే మరి..!

WhatsApp Features | ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగింది. ప్రతి ఒక్కరి చేతిలో తప్పనిసరిగా స్మార్ట్‌ఫోన్‌ తప్పనిసరిగా ఉంటున్నది. ఆయా స్మార్ట్‌ఫోన్లలో ఎక్కువ కనిపించే సోషల్‌ మీడియా యాప్‌ వాట్సాప్‌. ఫొటోలు, సందేశాలతో పాటు వీడియోలను సైతం పంపుకునేందుకు అవకాశం ఉంది. అలాగే కాలింగ్‌తో పాటు వీడియో కాల్స్‌ సైతం చేసుకునే వీలుంది. దాంతో పెద్ద ఎత్తున్న వాట్సాప్‌ను వినియోగిస్తుంటారు. అయితే, వాట్సాప్‌ యూజర్ల కోసం ఎప్పకప్పుడు ఫీచర్లను పరిచయం చేస్తుంటుంది. అయితే, ఇందులోని ఐదు […]

WhatsApp Features | వాట్సాప్‌లో ఈ ఫీచర్ల గురించి తెలుసా..? మీరూ ట్రై చేయండి..! వావ్‌ అనాల్సిందే మరి..!

WhatsApp Features |

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగింది. ప్రతి ఒక్కరి చేతిలో తప్పనిసరిగా స్మార్ట్‌ఫోన్‌ తప్పనిసరిగా ఉంటున్నది. ఆయా స్మార్ట్‌ఫోన్లలో ఎక్కువ కనిపించే సోషల్‌ మీడియా యాప్‌ వాట్సాప్‌. ఫొటోలు, సందేశాలతో పాటు వీడియోలను సైతం పంపుకునేందుకు అవకాశం ఉంది.

అలాగే కాలింగ్‌తో పాటు వీడియో కాల్స్‌ సైతం చేసుకునే వీలుంది. దాంతో పెద్ద ఎత్తున్న వాట్సాప్‌ను వినియోగిస్తుంటారు. అయితే, వాట్సాప్‌ యూజర్ల కోసం ఎప్పకప్పుడు ఫీచర్లను పరిచయం చేస్తుంటుంది. అయితే, ఇందులోని ఐదు ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

డేటా ఎంత వాడుతున్నామో ఎలా తెలుసుకోవాలంటే..?

వాట్సాప్‌ వినియోగిస్తే డేటా సైతం భారీగానే ఖర్చవుతుంది. వాట్సాప్‌ ద్వారా ఎంత డేటా వాడుతున్నారో తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. అయితే, ఎంత డేటా వాడుతున్నామో తెలుసుకునేందుకు మొదట సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. ఆ తర్వాత స్టోరేజ్‌ డేటాపై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత నెట్‌వర్క్‌ యూసేజ్‌ డేటా వివరాలను చూసుకుండే డేటా ఎంత వాడుతున్నామో తెలిసిపోతుంది.

డెస్క్‌టాప్‌లో వాట్సాప్‌ ఎలా వాడాలంటే..

వాట్సా్‌ప్‌ కేవలం మొబల్‌లోనే కాకుండా డెస్క్‌టాప్‌ కంప్యూటర్లలోనూ వాడుకునేందుకు అవకాశం ఉంటుంది. చాలా మందికి విషయం తెలిసినా.. కొందరు దీనిపై అవగాహన లేదు. డెస్క్‌టాప్‌లో కనెక్ట్‌ చేసుకునేందుకు వాట్సాప్‌ ఓపెన్‌ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. లింక్‌డ్‌ డివైజ్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది.

దాన్ని క్లిక్‌ చేస్తే క్యూ ఆర్‌ కోడ్‌ కనిపిస్తుంది. డెస్క్‌టాప్‌లో వెబ్‌ వాట్సాప్‌ ఓపెన్‌ చేసి స్కాన్‌ చేయాలి. లేదంటే.. వాట్సాప్‌ వెబ్‌లో లింక్‌ విత్‌ మొబైల్‌ నంబర్‌ను క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత వాట్సాప్‌ కనెక్ట్‌ చేయాలనుకుంటున్న నెంబర్‌ ఎంటర్‌ చేయాలి. మొబైల్‌లో వాట్సాప్‌ ఓపెన్‌ అవుతుంది. డెస్క్‌టాప్‌పై కనిపించే కోడ్‌ను ఎంటర్‌ చేస్తే కనెక్ట్‌ అవుతుంది.

చాట్‌లో వాల్‌పేపర్‌ ఎలా మార్చుకోవాలంటే..

వాట్సాప్‌లో చాట్స్‌లోనూ వాల్‌ పేపర్స్‌ను ప్రత్యేకంగా పెట్టుకునేందుకు అవకాశం ఉంది. ఇందు కోసం మొదట సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. ఆ తర్వాత ఛాట్స్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. అందులో చాట్‌ వాల్‌పేపర్లపై క్లిక్‌ చేయండి. వాల్‌ పేపర్‌ లైబ్రరీలో ఉన్నవాటినైనా.. గ్యాలరీతో పాటు ఇతర ఆప్షన్స్‌ నుంచి వచ్చిన వాల్‌ పేపర్స్‌ను మార్చుకునేందుకు అవకాశం ఉంది.

మెసేజ్‌లను మాయం చేయండిలా..!

వాట్సాప్‌లో వానిష్‌ మోడ్‌తో మెసేజ్‌లను కనిపించకుండా చేసే అవకాశం కూడా ఉన్నది. ఇందు కోసం ఏదైనా చాట్‌ను ఓపెన్‌ చేయాలి. ఆ తర్వాత సంబంధిత వ్యక్తి పేరుపై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత డిసప్పియరింగ్‌ మెసేజెస్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. మెసేజ్‌ టైమర్‌ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ సమయం వరకు మెసేజ్‌లు కనిపించవు.

మీడియాను కనిపించకుండా చేయుచ్చు..!

వాట్సాప్​ యూజర్ల కోసం కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్నది. ఇందులో మీరు పంపే ఫొటోలు, వీడియోలను సైతం డిసప్పియర్‌ చేసే ఫీచర్‌ సైతం తీసుకువచ్చింది. ఇందు కోసం ఏదైనా చాట్‌ను ఓపెన్‌ చేయాలి. ఎవరికైనా పంపాలని భావిస్తున్న వీడియోను, లేదంటే ఫొటోలను సెలక్ట్‌ చేసుకోవాలి.

ఆ తర్వాత ఫొటో, వీడియో కింది భాగంలో ‘1’ బటన్‌పై క్లిక్‌ చేయాలి. అనంతరం బ్లూ యారోపై క్లిక్​ చేయాలి. మీరు పంపిన, ఫొటోలు, వీడియోలు ఎవరికైతే పంపారో అవి ఒకసారి కనిపిస్తాయి. మళ్లీ ఓపెన్‌ చూసినా కనిపించవు.