సైంధవ్‌తో.. శైలేష్ స్టార్ట్ డైరెక్టర్ అవుతాడా..?

విధాత: ప్రస్తుతం టాలీవుడ్‌లో అందరి నోటా వినిపిస్తున్న మాట యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను. ఈయన ఇప్పటికే హిట్ ఫ్రాంచైజీలోని రెండు భాగాలను తెరకెక్కించారు. నాని నిర్మాతగా తెర‌కెక్కిన ఈ రెండు భాగాలు ఘ‌న విజయాలను నమోదు చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా మంచి విజ‌యం సాధించి గుర్తింపుతో పాటు క‌మ‌ర్షియ‌ల్గా కూడా వ‌ర్కౌట్ అయ్యాయి. హిట్ ఫ్రాంచైజీ కోసం శైలేష్ కొలను ఇప్పటికే దాదాపు ఏడెనిమిది భాగాలకు సంబంధించిన కథలను సిద్ధం చేసుకున్నాడట. అయితే హిట్ కథలను రాసుకోక […]

  • Publish Date - February 1, 2023 / 12:30 PM IST

విధాత: ప్రస్తుతం టాలీవుడ్‌లో అందరి నోటా వినిపిస్తున్న మాట యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను. ఈయన ఇప్పటికే హిట్ ఫ్రాంచైజీలోని రెండు భాగాలను తెరకెక్కించారు. నాని నిర్మాతగా తెర‌కెక్కిన ఈ రెండు భాగాలు ఘ‌న విజయాలను నమోదు చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా మంచి విజ‌యం సాధించి గుర్తింపుతో పాటు క‌మ‌ర్షియ‌ల్గా కూడా వ‌ర్కౌట్ అయ్యాయి.

హిట్ ఫ్రాంచైజీ కోసం శైలేష్ కొలను ఇప్పటికే దాదాపు ఏడెనిమిది భాగాలకు సంబంధించిన కథలను సిద్ధం చేసుకున్నాడట. అయితే హిట్ కథలను రాసుకోక ముందే ఆయన సైంధ‌వ్ స్టోరీ లైన్ తయారు చేసుకున్నాడని సమాచారం.

మొదటగా శైలేష్ కొలను తయారు చేసుకున్న స్టోరీ సైంధ‌వ్ అనే తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఓ స్టార్ హీరో చేస్తే బాగుంటుందని ఆయన భావించారు. కానీ కొత్త దర్శకుడైన త‌న‌ను నమ్మి ఏ స్టార్ హీరో అవకాశం ఇవ్వడు. కాబట్టి ముందుగా హిట్ చిత్రాలతో తన సత్తా నిరూపించుకున్నారు.

తాజాగా సైంధవ్ ను వెంకటేష్ హీరోగా ఆయన 75వ ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోంది. విక్టరీ వెంకటేష్‌తో శైలేష్ కొలను ఈ యాక్షన్ మూవీని ప్లాన్ చేశారు. సినిమా ఎలా ఉండబోతోంది అని రుచి చూపిస్తూ వ‌దిలిన ఫస్ట్ గ్లింప్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇది ఓ భారీ యాక్షన్ మూవీ అని తేలిపోయింది.

దాంతో హిట్ 3 కంటే ముందుగానే సైంధవ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నంలో శైలేష్ కొలను ఉన్నారు. హిట్ 3 లో నాని న‌టించ‌నున్నారు. దానికంటే ముందే సైంద‌వ్ థియేటర్లోకి రానున్నారు. వెంకీ కెరీర్‌లోనే ఇది ప్రత్యేకమైన సినిమా అవుతుందని చెప్పొచ్చు.

మామూలు ఎంటర్టైన‌ర్లు చేస్తే విక్టరీ వెంకటేష్ సీరియస్ రోల్స్ చేస్తే ఆ లెక్క వేరేగా ఉంటుంది. అది ఘర్షణతో పాటు నారప్పతో సహా గతంలో ఆయన నటించిన ఎన్నో చిత్రాలు నిరూపించాయి. మరి ఈ సినిమాలో యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను సీనియర్ స్టార్ హీరో వెంకీ మామను ఎలా చూపిస్తాడు అనేది అందరిలో ఆసక్తిని రేపుతోంది. ఈ చిత్రం గనుక హిట్ అయితే శైలేష్ కోల‌ను స్టార్ట్ డైరెక్టర్‌గా ప్రమోట్ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు.