Wines | తెలంగాణ‌లో మ‌ద్యం దుకాణాల‌కు త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్..!

Wines విధాత‌: తెలంగాణ‌లో మద్యం దుకాణాల‌కు త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్ వెలువ‌డ‌నుంది. రాష్ట్రంలోని 2,620 దుకాణాల‌కు రెండు రోజుల్లో నోటిఫికేష‌న్ వెలువ‌డ‌నున్న‌ట్లు తెలుస్తోంది. న‌వంబ‌ర్‌తో మ‌ద్యం దుకాణాల లైసెన్స్ గ‌డువు ముగియ‌నుంది. అసెంబ్లీ ఎన్నిక‌ల దృష్ట్యా ముంద‌స్తు నోటిఫికేష‌న్ ఇచ్చేందుకు రాష్ట్ర అబ్కారీ శాఖ క‌స‌ర‌త్తు చేస్తోంది. ద‌ర‌ఖాస్తులు, లైసెన్స్ ఫీజుల్లో మార్పు ఉండే అవ‌కాశం లేద‌ని అబ్కారీ శాఖ పేర్కొంది. ఎన్నిక‌ల‌కు ముందే ప్ర‌క్రియ పూర్తి చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో నోటిఫికేష‌న్ జారీ చేసేందుకు […]

  • Publish Date - August 2, 2023 / 12:30 AM IST

Wines

విధాత‌: తెలంగాణ‌లో మద్యం దుకాణాల‌కు త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్ వెలువ‌డ‌నుంది. రాష్ట్రంలోని 2,620 దుకాణాల‌కు రెండు రోజుల్లో నోటిఫికేష‌న్ వెలువ‌డ‌నున్న‌ట్లు తెలుస్తోంది. న‌వంబ‌ర్‌తో మ‌ద్యం దుకాణాల లైసెన్స్ గ‌డువు ముగియ‌నుంది. అసెంబ్లీ ఎన్నిక‌ల దృష్ట్యా ముంద‌స్తు నోటిఫికేష‌న్ ఇచ్చేందుకు రాష్ట్ర అబ్కారీ శాఖ క‌స‌ర‌త్తు చేస్తోంది. ద‌ర‌ఖాస్తులు, లైసెన్స్ ఫీజుల్లో మార్పు ఉండే అవ‌కాశం లేద‌ని అబ్కారీ శాఖ పేర్కొంది. ఎన్నిక‌ల‌కు ముందే ప్ర‌క్రియ పూర్తి చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో నోటిఫికేష‌న్ జారీ చేసేందుకు అబ్కారీ శాఖ క‌స‌ర‌త్తు చేస్తోంది. గ‌త‌ నోటిఫికేష‌న్‌లో ద‌ర‌ఖాస్తు ఫీజు ద్వారా రూ. 1,350 కోట్లు, లైసెన్స్ ఫీజు ద్వారా రూ. 3,500 కోట్ల ఆదాయం ప్ర‌భుత్వానికి స‌మ‌కూరింది.