Hyderabad | మ‌ల‌క్‌పేట‌లో మ‌హిళ త‌ల ల‌భ్యం.. మొండెం కోసం గాలింపు

Hyderabad | హైద‌రాబాద్ మ‌ల‌క్‌పేట పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఓ గుర్తు తెలియ‌ని మ‌హిళ త‌ల ల‌భ్యం కావ‌డం క‌ల‌కలం రేపింది. మూసీ ప‌రివాహ‌క ప్రాంతంలో ఓ న‌ల్ల‌టి క‌వ‌రులో మ‌హిళ త‌ల ల‌భ్యం కావ‌డంతో స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. హుటాహుటిన ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ క‌లిసి త‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆధారాలు సేక‌రించారు. డాగ్ స్క్వాడ్‌తో దర్యాప్తు చేప‌ట్టారు. మ‌హిళ మొండెం మాత్రం ల‌భ్యం కాలేదు. అయితే మ‌హిళ‌ను ఎక్క‌డో చంపి, […]

Hyderabad | మ‌ల‌క్‌పేట‌లో మ‌హిళ త‌ల ల‌భ్యం.. మొండెం కోసం గాలింపు

Hyderabad | హైద‌రాబాద్ మ‌ల‌క్‌పేట పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఓ గుర్తు తెలియ‌ని మ‌హిళ త‌ల ల‌భ్యం కావ‌డం క‌ల‌కలం రేపింది. మూసీ ప‌రివాహ‌క ప్రాంతంలో ఓ న‌ల్ల‌టి క‌వ‌రులో మ‌హిళ త‌ల ల‌భ్యం కావ‌డంతో స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

హుటాహుటిన ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ క‌లిసి త‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆధారాలు సేక‌రించారు. డాగ్ స్క్వాడ్‌తో దర్యాప్తు చేప‌ట్టారు. మ‌హిళ మొండెం మాత్రం ల‌భ్యం కాలేదు. అయితే మ‌హిళ‌ను ఎక్క‌డో చంపి, ఇక్క‌డ త‌ల పడేసి ఉంటార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఘ‌ట‌నాస్థ‌లాన్ని అడిష‌న‌ల్ డీసీపీ ఆనంద్, మ‌ల‌క్‌పేట ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీనివాస్ ప‌రిశీలించారు. అన్ని కోణాల్లో ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు తెలిపారు. మ‌హిళ త‌ల‌ను ఉస్మానియా ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు పేర్కొన్నారు.

ఈ మహిళ ఎవరు.. ఏ ప్రాంతానికి చెందిన వారు.. హత్య చేయటానికి కారణాలు ఏంటీ.. చేసింది ఎవరు.. ఎప్పుడు, ఎక్కడ హత్య జరిగింది.. తలను వేరు చేయటానికి కారణాలు ఏంటీ అనే విషయాలపై విచారణ చేస్తున్నారు. తల ఆధారంగా మహిళ ఎవరు అనేది గుర్తించటానికి ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేశారు పోలీసులు.