Mass Copying| పరీక్షల్లో కాపీయింగ్…స్క్వాడ్ రాకతో రోడ్డుపైకి పుస్తకాలు..ఫోన్ల విసిరేసివేత!

రోడ్డుపై వెలుతున్న వారిపై ఆకస్మాత్తుగా పుస్తకాలు..ఫోన్ల వర్షం కురిసింది. ఇదేమి వింత అని పరిశీలించి చూస్తే..సమీపంలోని ఓ కళాశాల భవనం నుంచి మాస్ కాపియింగ్ సందర్బంగా స్క్వాడ్ రాకతో ఆ పుస్తకాలు, ఫోన్లను రోడ్డుపైకి విసిరేశారు.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Nov 29, 2025, 12:08 pm IST
Read Time: 3 mins
Mass Copying| పరీక్షల్లో కాపీయింగ్…స్క్వాడ్ రాకతో రోడ్డుపైకి పుస్తకాలు..ఫోన్ల విసిరేసివేత!

విధాత, హైదరాబాద్ : రోడ్డుపై వెలుతున్న వారిపై ఆకస్మాత్తుగా పుస్తకాలు..ఫోన్ల వర్షం కురిసింది. ఇదేమి వింత అని పరిశీలించి చూస్తే..సమీపంలోని ఓ కళాశాల భవనం నుంచి ఆ పుస్తకాలు, ఫోన్లు రోడ్డుపై పడ్డాయి. ఎందుకిలా చేశారని ఆరాతీస్తే..అందులో ఓ పరీక్ష జరుగుతుంది. పరీక్షకు హాజరైన వారంతా పుస్తకాలు, ఫోన్లు ముందుపెట్టుకుని పరీక్ష(mass copying) రాస్తున్నారు. ఇంతలో స్క్వాడ్(Examination Squad) వస్తున్నారన్న సమాచారం అందడంతో ఉలిక్కిపడిన విద్యార్థులు..ఎక్కడ దొరికిపోతామోనన్న భయంతో తమ పుస్తకాలను, ఫోన్లను, కాపీ స్లిప్సులను అదరబాదరగా భవనం నుంచి బయటకు విసిరేశారు.

అవన్ని పక్కనే ఉన్న రోడ్డుపై పడిపోయాయి. దీంతో ఆ రోడ్డు మార్గంలో వెలుగున్న వాహనదారులు, బాటసారులు ఈ ఘటన పట్ల విస్మయానికి గురయ్యారు. ఈ ఘటన హైదరాబాద్ (Hyderabad) మలక్ పేట్ (Malakpet)ఎంఎస్ కాలేజ్(MS College) లో చోటుచేసుకుంది. రోడ్డుపై విసిరేసిన పుస్తకాలు, ఫోన్ల వ్యవహారంలో కళశాలలో జరిగిన మాస్ కాపీయింగ్ కలక వ్యవహారం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్ పరీక్షల సందర్బంగా ఆ కళాశాలలో మాస్ కాపియింగ్ జరిగినట్లుగా సమాచారం.