విధాత: హైటెక్ మెట్రో స్టేషన్‌లో ఎస్కలేటర్‌పై ఒక యువతి తీవ్రంగా గాయపడితే అక్కడే ఉన్న మెట్రో సిబ్బంది స్పందించకుండా నిర్లక్ష్యంగా వదిలేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే ఒక యువతి ఎస్కలేటర్‌పై వెళ్తూ గాయ పడి విలవిల లాడింది. పక్కన ఉన్న మరో అమ్మాయి కాటన్ ఇవ్వండి, సహాయం చేయండి అని ఎంత విజ్ఞప్తి చేసినా సమీపంలో ఉన్నవారెవరూ పట్టించుకోలేదు.
ఓ ఇంగ్లీష్ మీడియాలో పని చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ ప్రాథమిక చికిత్స చేయమని అక్కడ ఉన్న సిబ్బందిని కోరినా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ప్రథమ చికిత్స ఆలస్యం కావడంతో చాలా రక్తం పోయి, నీరసించి, ఆ యువతి స్పృహ తప్పి పడిపోయింది.
దీంతో సదరు జర్నలిస్ట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో మెట్రో సిబ్బంది ఆలస్యంగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చారు. మెట్రో స్టేషన్‌లో జరిగిన సంఘటనపై సదరు జర్నలిస్ట్ ప్లీజ్ సీరియస్‌గా తీసుకోండి. సకాలంలో స్పందించి ప్రమాదాల బారిన పడిన వారికి ప్రాథమిక చికిత్స అందించండి అని ఫేస్ బుక్‌లో ట్యాగ్ చేశారు.