బామ్మకు దడ పుట్టించిన బాతు బొమ్మ.. వీడియో వైరల్
Duck | మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్నారా? ఏవైనా శబ్దాలు వినిపిస్తున్నాయా? అప్పుడు మీకు ఎన్నో రకాల ఆలోచనలు వస్తుంటాయి. దెయ్యాలు వచ్చాయేమో అని భయపడిపోతుంటారు. లేదంటే ఇంట్లో ఉన్న వస్తువులు ఏవైనా కదిలి, కదలనట్టు ఉన్నా కూడా శరీరమంతా చెమటలు పట్టేస్తాయి. అలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. ఓ వృద్ధురాలు తన ఇంట్లోనే సోఫాపై కూర్చుంది. కార్పెట్‌కు అనుకుని ఓ బాతు బొమ్మ ఉంది. ఆ బొమ్మను బామ్మ రెగ్యులర్‌గా చూస్తూనే ఉంటుంది. కానీ […]

Duck | మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్నారా? ఏవైనా శబ్దాలు వినిపిస్తున్నాయా? అప్పుడు మీకు ఎన్నో రకాల ఆలోచనలు వస్తుంటాయి. దెయ్యాలు వచ్చాయేమో అని భయపడిపోతుంటారు. లేదంటే ఇంట్లో ఉన్న వస్తువులు ఏవైనా కదిలి, కదలనట్టు ఉన్నా కూడా శరీరమంతా చెమటలు పట్టేస్తాయి. అలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది.
ఓ వృద్ధురాలు తన ఇంట్లోనే సోఫాపై కూర్చుంది. కార్పెట్‌కు అనుకుని ఓ బాతు బొమ్మ ఉంది. ఆ బొమ్మను బామ్మ రెగ్యులర్‌గా చూస్తూనే ఉంటుంది. కానీ ఈ సారి ఆ బాతు బొమ్మలో ఆమెకు దెయ్యం కనిపించింది. బాతు ఒక్కోసారి కదిలింది. కదిలి, కదలనట్లు ఉండటంతో ఆమె ఆ బొమ్మ వైపే తదేకంగా చూసింది.
అది అలానే చేస్తుండటంతో వృద్ధురాలు వణికిపోయింది. ఒక్కసారి బాతు ఆమె కాళ్ల దగ్గరకు రివర్స్‌లో దూసుకెళ్లింది. దీంతో వృద్ధురాలు భయపడి సోఫా నుంచి కింద పడిపోయింది. గుండె ఆగినంత పనైంది ఆ బాతు బొమ్మ చేసిన పనికి.
ఈ వీడియోను లారా అనే యూజర్ తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో అక్టోబర్ 25న పోస్టు చేయగా, ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. 12.4 మిలియన్ల మంది ఈ వీడియోను వీక్షించారు. అయితే వృద్ధురాలిని కూతురే ప్రాంక్ చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఇలాంటి ప్రాంక్ చేయొద్దని, ప్రమాదం జరిగితే ఎవరికి నష్టం అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
View this post on Instagram