Couple Love | ప్రేమలో పడటం, ఆపై ప్రేమించుకోవడం అనేది గొప్ప కళ. ఒక్కసారి ప్రేమించడం మొదలు పెట్టామంటే.. జీవితాంతం ప్రేమిస్తూనే ఉండాలి. ఏ సందర్భలోనైనా సరే.. ప్రేమను కురిపిస్తూనే ఉండాలి. అయితే ప్రస్తుత సమాజంలో ప్రేమ కరువై, కుమిలిపోతున్న జంటలు ఎన్నో. కేవలం అవసరాల కోసం ప్రేమిస్తున్నారు. హోదాను చూసి ప్రేమిస్తున్నారు. కానీ అలాంటి ప్రేమ ముందు.. ఈ ప్రేమ ఎంతో గొప్పదో. ఇదే కదా అసలైన ప్రేమ.
ఓ ఇద్దరు దంపతులు కర్ణాటకలోని ఓ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌పై కూర్చున్నారు. అయితే వారు వెళ్లాల్సిన రైలు రావడానికి సమయం ఉంది. అప్పటికే అలసిపోయిన భార్య కునుకు తీసేందుకు యత్నించింది. ఆమెను గమనించిన భర్త.. తన ఒడిలో భార్యను పడుకోబెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమె తలను తన చేతితో నిమురుతూ.. చంటి బిడ్డలా నిద్ర పుచ్చాడు.
ముంగీస చేతిలో మట్టి కరిచిన నల్ల త్రాచు.. వీడియో వైరల్
అతనికి కూడా కునుకు వస్తున్నప్పటికీ, తాను నిద్రించకుండా తన భార్య కోసం తన నిద్రను త్యాగం చేశాడు. ఇక ఈ వీడియోను షేర్ చేసిన వ్యక్తి.. జీవిత ప్రయాణంలో నిజమైన సహచరుడు పక్కనే ఉంటాడు అని రాశాడు. భార్య పట్ల భర్త గుండెల నిండా ఉన్న ఆ ప్రేమకు లవర్స్, నెటిజన్లు హాట్యాఫ్ చెప్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 57 వేల మంది వీక్షించారు. వీరి ప్రేమ గొప్పది అని చాలా మంది తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.
हमसफर वही जो हर सफर में आपके साथ हो ❤️