మెట్రో ట్రాక్‌పై నుంచి దూకుతాన‌ని మ‌హిళ బెదిరింపులు

ఓ మ‌హిళ మెట్రో ట్రాక్‌పై ప్ర‌త్య‌క్ష‌మైంది. అక్క‌డ్నుంచి కింద‌కు దూకుతాన‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డింది. అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు ఆమెను ప్రాణాల‌తో ర‌క్షించారు

మెట్రో ట్రాక్‌పై నుంచి దూకుతాన‌ని మ‌హిళ బెదిరింపులు

న్యూఢిల్లీ: ఓ మ‌హిళ మెట్రో ట్రాక్‌పై ప్ర‌త్య‌క్ష‌మైంది. అక్క‌డ్నుంచి కింద‌కు దూకుతాన‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డింది. అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు ఆమెను ప్రాణాల‌తో ర‌క్షించారు. ఈ ఘ‌ట‌న ఢిల్లీలోని షాదీపూర్ మెట్రో స్టేష‌న్ వ‌ద్ద నిన్న సాయంత్రం 5 గంట‌ల‌కు చోటు చేసుకుంది.


మెట్రో ట్రాక్ ప‌క్క‌న ఏర్పాటు చేసిన సైడ్‌వాల్ వ‌ద్ద మ‌హిళ నిల‌బ‌డి ఉంది. ఒక చేతిలో ఫోన్ ప‌ట్టుకున్న ఆమె మ‌రో చేతితో సైడ్ వాల్ ఎక్కి దూకే ప్ర‌య‌త్నం చేసింది. ఆమెను గ‌మ‌నించిన అధికారులు, పోలీసులు.. ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా, వేగంగా ఆమె వ‌ద్ద‌కు చేరుకున్నారు.


అనంత‌రం ఆమెను మెట్రో రైలులో ఎక్కించారు. అయితే ఆ మ‌హిళ మెట్రో ట్రాక్ పైకి ఎలా చేరుకుంది అనేది తెలియాల్సి ఉంద‌న్నారు పోలీసులు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.