జిమ్‌లో మహిళల సిగపట్లు.. ఎందుకో తెలుసా..? వీడియో
విధాత: అది ఓ ఉమెన్ జిమ్ సెంటర్. మహిళలందరూ వర్క్ అవుట్ చేస్తున్నారు. కానీ ఓ ఇద్దరు మహిళలు పంచుల వర్షం కురిపించుకున్నారు.. సిగపట్లు పట్టుకున్నారు. తోటి మహిళలు వచ్చి వారిని విడిపించారు. మరి ఈ మహిళలు ఎందుకు కొట్టుకున్నారంటే.. స్మిత్ మెషీన్ కోసం. బ్లాక్ కలర్ టీ షర్ట్ ధరించిన ఓ యువతి.. స్మిత్ మెషీన్ వద్ద వెయిట్ చేస్తోంది. అప్పటికే ఓ మహిళ దానిపై వర్క్ అవుట్ చేస్తోంది. ఇక ఆమె అక్కడ్నుంచి వెళ్లిపోయిన […]

విధాత: అది ఓ ఉమెన్ జిమ్ సెంటర్. మహిళలందరూ వర్క్ అవుట్ చేస్తున్నారు. కానీ ఓ ఇద్దరు మహిళలు పంచుల వర్షం కురిపించుకున్నారు.. సిగపట్లు పట్టుకున్నారు. తోటి మహిళలు వచ్చి వారిని విడిపించారు. మరి ఈ మహిళలు ఎందుకు కొట్టుకున్నారంటే.. స్మిత్ మెషీన్ కోసం.
బ్లాక్ కలర్ టీ షర్ట్ ధరించిన ఓ యువతి.. స్మిత్ మెషీన్ వద్ద వెయిట్ చేస్తోంది. అప్పటికే ఓ మహిళ దానిపై వర్క్ అవుట్ చేస్తోంది. ఇక ఆమె అక్కడ్నుంచి వెళ్లిపోయిన వెంటనే.. అప్పటికే వెయిటింగ్‌లో ఉన్న యువతి ఆ మెషీన్ వద్దకు చేరింది.
అంతలోనే ఎల్లో కలర్ టీ షర్ట్ ధరించిన మరో యువతి స్మిత్ మెషీన్‌ను మీద కూర్చుంటున్న మహిళపై చేయి చేసుకుంది. తాను ఆక్రమించుకునే పనిలో భాగంగా ఈ దాడికి పాల్పడింది ఎల్లో కలర్ టీ షర్ట్ యువతి. ఇక ఇద్దరు కొట్టుకున్నారు, సిగపట్లు పట్టుకున్నారు. మిగతా మహిళలు వచ్చి వారిని విడిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.