బస్సులో బూట్లతో కొట్టుకున్న మహిళా ప్రయాణికులు.. వీడియో
బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు చాలా మంది విండో సీటు వైపు కూర్చునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఎందుకంటే గాలి కోసం లేదంటే ప్రకృతిని ఆస్వాదించడం కోసం

విధాత: బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు చాలా మంది విండో సీటు వైపు కూర్చునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఎందుకంటే గాలి కోసం లేదంటే ప్రకృతిని ఆస్వాదించడం కోసం. అయితే ఓ మహిళ విండోను మూసేయడంతో మరో మహిళకు కోపం వచ్చింది. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బూట్లతో ఒకరికొకరు కొట్టుకున్నారు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ఫిబ్రవరి 8వ తేదీన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
రాకేశ్ ప్రకాశ్ అనే వ్యక్తి ఈ వీడియోను ఎక్స్ ఖాతాలో పోస్టు చేశాడు. విండో మూసేయడం కారణంగానే ఇద్దరు మహిళల మధ్య వివాదం తలెత్తినట్లు పేర్కొన్నాడు. ఆ తర్వాత ఇద్దరూ బూట్లతో కొట్టుకుని, కోపంతో రగిలిపోయారని తెలిపాడు. అయితే మిగతా ప్రయాణికులు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆ ఇద్దరు మహిళలు శాంతించలేదు. చివరకు కండక్టర్ ఆ ఇద్దరి మధ్య నెలకొన్న వివాదానికి పుల్‌స్టాప్ పెట్టాడు.
ఇక మహిళల ఫైటింగ్‌ను కొందరు ఎంజాయ్ చేస్తే.. ఇంకోందరేమో విండో మూసినంత మాత్రాన దాడులు చేసుకోవడం సరికాదన్నారు. బస్సుల్లో ఇలాంటి ఘటనలు సహజం అని కొందరు రాసుకొచ్చారు. మహిళల బూట్ల దాడి వీడియో మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.