ఏసీబీ వలలో యాదాద్రి జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి
విధాత,యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి (DTDO) కరమ్‌తోతు మంగ్తా నాయక్ రూ.50,000/- లంచం తీసుకుంటూ గురువారం సాయంత్రం పట్టుబడ్డాడు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (HWO) స్వరాజ్యం నుంచి రూ. 1,00,000 విడుదల చేసినందుకు రూ.50,000/- డిమాండ్ చేసి లంచం తీసుకున్నాడు. నిందితుడు మంగ్తా నాయక్‌ను అరెస్టు చేసి SPE మరియు ACB కేసులకు ప్రత్యేక న్యాయమూర్తి, హైదరాబాద్ ఎదుట హాజరు పర్చనున్నారు. కేసు విచారణలో ఉంది. ఏవరైనా పబ్లిక్ సర్వెంట్ లంచం డిమాండ్ […]

విధాత,యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి (DTDO) కరమ్‌తోతు మంగ్తా నాయక్ రూ.50,000/- లంచం తీసుకుంటూ గురువారం సాయంత్రం పట్టుబడ్డాడు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (HWO) స్వరాజ్యం నుంచి రూ. 1,00,000 విడుదల చేసినందుకు రూ.50,000/- డిమాండ్ చేసి లంచం తీసుకున్నాడు.
నిందితుడు మంగ్తా నాయక్‌ను అరెస్టు చేసి SPE మరియు ACB కేసులకు ప్రత్యేక న్యాయమూర్తి, హైదరాబాద్ ఎదుట హాజరు పర్చనున్నారు. కేసు విచారణలో ఉంది.
ఏవరైనా పబ్లిక్ సర్వెంట్ లంచం డిమాండ్ చేస్తే, చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడానికి ACB టోల్ ఫ్రీ నంబర్ 1064ను సంప్రదించాలని ఈ సందర్భంగా ప్రజలను అభ్యర్థించారు.