Pawan Kalyan | పవన్ కళ్యాణ్ కితకితలు.. హరీశ్‌రావుకు మద్దతుగా ట్విట్టర్ పోస్ట్

విధాత‌: పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సీరియస్ రాజకీయాలు చేస్తున్నారా.? అసలు ఆయన ఎం చేస్తున్నారో.. ఏమి మాట్లాడుతున్నారో ఆయనకు అర్థం అవుతోందా.? లోకం అంతా ఒకతీరున ఉన్నపుడు ఆయన మాత్రం వేరే విధముగా మాట్లాడుతూ జనం ఎటెన్షన్ ఎందుకు ఆకర్షిస్తున్నారు. అసలు ఆయన ప్రజా ఆలోచనలమేరకు స్పందిస్తున్నారా.? ఎవరి కోసమో ఏదేదో మాట్లాడుతున్నారా అన్నది ఒక్కోసారి అర్థం కానీ పరిస్థితి. ఆమధ్య తెలంగాణ మంత్రి హరీష్ రావు(Harish Rao) ఓ సభలో మాట్లాడుతూ ఆంధ్రాలో పాలనా బాలేదు.. […]

  • Publish Date - April 17, 2023 / 08:58 AM IST

విధాత‌: పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సీరియస్ రాజకీయాలు చేస్తున్నారా.? అసలు ఆయన ఎం చేస్తున్నారో.. ఏమి మాట్లాడుతున్నారో ఆయనకు అర్థం అవుతోందా.? లోకం అంతా ఒకతీరున ఉన్నపుడు ఆయన మాత్రం వేరే విధముగా మాట్లాడుతూ జనం ఎటెన్షన్ ఎందుకు ఆకర్షిస్తున్నారు. అసలు ఆయన ప్రజా ఆలోచనలమేరకు స్పందిస్తున్నారా.? ఎవరి కోసమో ఏదేదో మాట్లాడుతున్నారా అన్నది ఒక్కోసారి అర్థం కానీ పరిస్థితి.

ఆమధ్య తెలంగాణ మంత్రి హరీష్ రావు(Harish Rao) ఓ సభలో మాట్లాడుతూ ఆంధ్రాలో పాలనా బాలేదు.. తెలంగాణాలో బతుకుతున్న ఆంధ్ర ప్రజలంతా ఇక్కడే ఓటు తీసుకోండి. అన్నట్లుగా మాట్లాడారు.. ఆ తరువాత కేటీఆర్ సైతం తమ ప్రయత్నం వల్లనే స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆగిందని, తాము ఆంధ్రకు పెద్ద లాభం చేశామన్నట్లుగా మాట్లాడారు.

ఇలాంటి వ్యాఖ్యలు ఆంధ్ర మంత్రుల్లో అసహనానికి కారణమయ్యాయి. సీదిరి అప్పలరాజు, కారుమూరి నాగేశ్వర రావు వంటి వాళ్ళు తెలంగాణ మంత్రుల మీద దుమ్మెత్తారు. మీ తెలంగాణాలో పరిస్థితులు ఎలా ఉన్నాయో…. స్కూళ్ళు… ఆస్పత్రులు … ఎలా ఉన్నాయో ఇక్కడ ఆంధ్రాలో ఎలా ఉన్నాయో చూసుకోండి అంటూ కౌంటర్లు వేశారు.

ఇక వైసిపి సోషల్ మీడియా సైతం గట్టిగా ఎదురు దాడి చేసింది.. మొత్తానికి ఈ కామెంట్లు, ప్రకటనలు, సవాళ్ల హడావుడి ముగిసింది. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ఒక వాయిస్ రికార్డ్ ను ట్విట్టర్లో విడుదల చేసారు. ఆంధ్రమంత్రులు .. తెలంగాణ(Telangana) ప్రజలకు. మంత్రులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. ఆయన ఆంధ్రాలో రాజకీయాలు చేస్తూ తెలంగాణకు మద్దతుగా మాట్లాడడం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు కానీ, ఇబ్బందుల్లో ఉన్నపుడు కానీ ఏనాడూ బయటికి వచ్చి ప్రజలకు మద్దతుగా మాట్లాడని పవన్ ఇప్పుడు ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడడం ఏమిటని అంటున్నారు. అంటే ఈయన కేసీఆర్, ప్రభుత్వం కనుసన్నల్లో ఉంటున్నారా.? తెరవెనుక కేసీఆర్ కు సపోర్ట్ చేస్తున్నారా? అనే సందేహాలు వస్తున్నాయి.