AP MLA | వాళ్లకేనా సస్పెన్షన్లు.. వీళ్లకు లేవా

దమ్ము లేదా… చేతకాదా విధాత‌: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి అనూరాధ (Anuradha) గెలుపు పలు రాజకీయ పరిణామాలకు తెరతీసింది. ఈ ఎన్నికల ప్రక్రియలో వైసీపీ నుంచి గట్టుదాటి టీడీపీ అభ్యర్థికి ఓటేసిన నలుగురు ఎమ్మెల్యేల (AP MLA)  మీద వైసీపీ వేటు వేసింది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati Chandrasekhar Reddy), ఉండవల్లి శ్రీ దేవి (Undavalli Sridevi), ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotam […]

  • Publish Date - March 25, 2023 / 08:11 AM IST
  • దమ్ము లేదా… చేతకాదా

విధాత‌: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి అనూరాధ (Anuradha) గెలుపు పలు రాజకీయ పరిణామాలకు తెరతీసింది. ఈ ఎన్నికల ప్రక్రియలో వైసీపీ నుంచి గట్టుదాటి టీడీపీ అభ్యర్థికి ఓటేసిన నలుగురు ఎమ్మెల్యేల (AP MLA) మీద వైసీపీ వేటు వేసింది.

మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati Chandrasekhar Reddy), ఉండవల్లి శ్రీ దేవి (Undavalli Sridevi), ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotam Reddy Sridhar Reddy).. ఈ నలుగురిని సస్పెండ్ చేస్తూ పార్టీరీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఉత్తర్వులు ఇచ్చారు.

అయితే ఇదే తరుణంలో మరి కొన్ని సందేహాలు, ఉచిత సలహాలు వంటివి సోషల్ మీడియాలో పోటెత్తుతున్నాయి. సరే టీడీపీకి ఓటేసినందుకు ఆ నలుగురిని సస్పెండ్ చేశారు మంచిదే.

కానీ నాలుగేళ్లుగా జగన్ కంట్లో నలుసులా, చెప్పులో తేలులా ఉంటూ తెగ ఇబ్బంది పెడుతున్న నరసాపురం ఎంపీ రఘురామరాజు (MP Raghuramaraj)ను ఎందుకు సస్పెండ్ చేయలేదన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన్ను తప్పించే దమ్ము లేదా… లేకుంటే ఎందుకొచ్చిన బుర్రబాధ అని జగన్ ఇగ్నోర్ చేసేసాడా అనే అనుమానాలు వస్తున్నాయి.

ఇక జగన్ తరఫున ఇలా ఉంటె మరి అదే శాసనమండలి ఎన్నికల్లో నలుగురు సభ్యులు మద్దాలి గిరి, కారణం బలరాం, వాసుపల్లి గణేష్, వల్లభనేని వంశి మోహన్ వీళ్లంతా టీడీపీ తరఫున గెలిచినప్పటికీ వైఎస్సార్సీపీతో ఉంటున్నారు. నిన్నటి ఎన్నికల్లో వీళ్ళు వైసీపీ అభ్యర్థులకే ఓటు వేశారు. మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు. వాళ్ళను చంద్రబాబు ఎందుకుం సస్పెండ్ చేయలేదు అన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి.

పొద్దున్న లేస్తే చంద్రబాబును, లోకేష్ ను నోటికొచ్చినట్లు తిట్టే వంశీ జోలికి వచ్చే దమ్ము చంద్రబాబుకు లేదా. వాళ్ళను సస్పెండ్ చేసే సాహసం ఎందుకు చేయలేదని పార్టీ కార్యకర్తలు సైతం ప్రశ్నిస్తున్నారు. ఏమో.. లోలోన ఎవరికీ ఏమేం కారణాలు ఉన్నాయో కానీ అటు రఘురామరాజు మీద జగన్ చర్యలు తీసుకోలేదు. ఇటు ఈ నలుగురి మీద చంద్రబాబు కూడా ఏమీ చర్యలు లేవు. చెల్లుకు చెల్లు.. గప్ చుప్ సాంబార్ బుడ్డి… అంతే అనుకుంటున్నారు.