Ayodhya | రామ‌మందిరం కోసం క‌ష్ట‌ప‌డ్డ విక‌లాంగుడు..

అత‌ను రామ భ‌క్తుడు.. నిత్యం శ్రీరాముడిని జ‌పిస్తుంటాడు. వికలాంగుడైన అత‌ను అయోధ్య‌లోని రామ‌మందిరం కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడు

Ayodhya | రామ‌మందిరం కోసం క‌ష్ట‌ప‌డ్డ విక‌లాంగుడు..
  • దురుసుగా ప్ర‌వ‌ర్తించిన యోగి స‌ర్కార్

Ayodhya | విధాత‌: అత‌ను రామ భ‌క్తుడు.. నిత్యం శ్రీరాముడిని జ‌పిస్తుంటాడు. వికలాంగుడైన అత‌ను అయోధ్య‌లోని రామ‌మందిరం కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడు. రామాల‌యం కోసం ద‌శాబ్ద‌లుగా అత‌ని కుటుంబం క‌రసేవ‌కులుగా ప‌ని చేసింది. అత‌ను కూడా రామ‌మందిరం నిర్మాణంలో పాలుపంచుకున్నాడు. కానీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మాత్రం అత‌నిపై ఉక్కుపాదం మోపింది.


వివ‌రాల్లోకి వెళ్తే.. అయోధ్య‌లోని రామ‌మందిరానికి స‌మీపంలో సోను శ‌ర్మ అనే వికలాంగుడు నివాసం ఉంటున్నాడు. అత‌ను వృత్తిరీత్యా క్షౌర‌శాల నిర్వ‌హిస్తున్నాడు. రోజుకు రూ. 300 సంపాదిస్తున్నాడు. ఇక అత‌ని కుటుంబం క‌ర‌సేవ‌కులుగా ప‌ని చేసింది. రామ‌మందిరం నిర్మాణంలో కూడా సోను శ‌ర్మ త‌న వంతు క‌ష్ట‌ప‌డ్డాడు.


కానీ చివ‌ర‌కు యూపీ ప్ర‌భుత్వం అత‌ని షాపును బుల్డోజ‌ర్‌తో ధ్వంసం చేసింది. ఇప్పుడేమో నెల‌వారి చెల్లింపులు చేయాల‌ని ప్ర‌భుత్వం అడుగుతోంద‌ని సోనుశ‌ర్మ ఆవేద‌న‌కు గుర‌య్యాడు. త‌న ధీన‌గాథ‌ను చెబుతూ సోను శ‌ర్మ క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యాడు. త‌న క‌ష్టం మ‌రెవ‌రికి రాకూడ‌ద‌ని ఆ శ్రీరాముడిని ప్రార్థించాడు.