విధాత: నల్లగొండ జిల్లా నేరేడుగోమ్ము మండలం వైజాగ్ కాలనీ వద్ద శనివారం సాగర్ బ్యాక్ వాటర్‌లో మునిగి భరత్ చారి(25) అనే యువకుడు మృతి చెందాడు.
జిల్లాలోని త్రిపురారం మండల కేంద్రానికి చెందిన భరత్ చారి ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తూ హైదరాబాదులో నివసిస్తున్నాడు. శనివారం ఉదయం భరత్ చారితో పాటు మరో ముగ్గురు స్నేహితులు హైద్రాబాద్ నుంచి వైజాగ్ కాలనీ సందర్శనకు వచ్చారు.
కాగా.. నలుగురు యువకులు ఈత కొట్టేందుకు సాగర్ జలాల్లోకి దిగగా నీటిలో ఉన్న గుంతను గమనించక భరత్ చారి గుంతలో పడి మునిగిపోయాడు.
గమనించిన మిత్రులు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు భరత్ చారిని బయటికి తీశారు. అప్పటికే భరత్ చారి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు చెప్పారు.