Mancherial | ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా దారుణహత్య

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలో ఘ‌ట‌న‌ యువతికి మెసేజ్‌లు పెట్టి వేధిస్తున్న క్రమంలో హత్య చేసిన యువతి కుటుంబ సభ్యులు . హత్య చేసిన ఘటన సీసీ కెమెరాల్లో నిక్షిప్తం. విధాత ప్రతినిధి అదిలాబాద్: మంచిర్యాల (Mancherial) జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని జైపూర్ మండలం ఇందారం గ్రామంలో అదే గ్రామంలోని నజీర్ పల్లెకు చెందిన  ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఇందారం  గ్రామపంచాయతీలోని నజీర్ పల్లె కు చెందిన ముస్కె మహేష్  అనే […]

  • Publish Date - April 25, 2023 / 01:01 PM IST
  • మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలో ఘ‌ట‌న‌
  • యువతికి మెసేజ్‌లు పెట్టి వేధిస్తున్న క్రమంలో హత్య చేసిన యువతి కుటుంబ సభ్యులు .
  • హత్య చేసిన ఘటన సీసీ కెమెరాల్లో నిక్షిప్తం.
విధాత ప్రతినిధి అదిలాబాద్: మంచిర్యాల (Mancherial) జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని జైపూర్ మండలం ఇందారం గ్రామంలో అదే గ్రామంలోని నజీర్ పల్లెకు చెందిన ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు.
ఇందారం గ్రామపంచాయతీలోని నజీర్ పల్లె కు చెందిన ముస్కె మహేష్ అనే యువకుడు గత కొన్ని నెలలుగా ఇందారం గ్రామానికి చెందిన ఓ వివాహితను వేదింపులకు గురి చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.
ఒకటి రెండుసార్లు యువతి కుటుంబ సభ్యులు ఆ యువకుడిని హెచ్చరించినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో మంగళవారం ఉదయం వివాహిత తండ్రి , అన్న , మరొకరు కలిసి మహేష్ ను దారి కాసి రోడ్డుపై గొడ్డలితో దారుణంగా నరికి చంపారు .
గొడ్డలితోని నరకడంతో కిందపడిన మహేష్ ను వివాహిత తండ్రి బండరాయితో కొట్టి హత్య చేశాడు . జైపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.