YS JAGAN
విధాత: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి (YS JAGAN) ప్రతిపక్ష నేత చంద్రబాబు మీద ద్వజమెత్తారు. అనంతపురం జిల్లాలో జగనన్న వసతి విద్యా దీవెన(#JaganannaVasathiDeevena) కార్యక్రమంలో మాట్లాడుతూ చంద్రబాబును నర మాంసం రుచి మరిగిన పులిగా పేర్కొంటూ ఆయన మళ్లీ ప్రజలను వంచిస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
అడవుల్లో ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ సీనియర్ ముసలి పులి ఉండేదని, అది ఇతర జంతువులను తినేస్తూ ఉండేది. కొన్నాళ్లకు పులి ముసలైపోయింది వేటాడే శక్తి కోల్పోయింది. దాంతో నాలుగు బంగారు నగలను తన దగ్గర పెట్టుకుని ఒక మడుగు దగ్గర కూర్చుని దారిన పోయే బాటసారులను మాయ మాటలతో దగ్గరకు రప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. దానికి తోడు కొన్ని గుంటనక్కలు సైతం ఆ పులికి తోడయ్యాయి అంటూ కొన్ని చానల్స్ పేర్లు చెప్పారు.
నేను మారిపోయాను నన్ను నమ్మండి నా దగ్గర ఉన్న నగలు ఇస్తాను ముందు మడుగులో స్నానం చేసి రండి అని పులి బాటసారులను చెప్పేది . కొంతమంది మాత్రం పులి మాటలు నమ్మి మడుగులో దిగి ఆ బురదలో చిక్కుకుని పోతే పులి వారిని తినేసేది. ఈకథలో పులి ఎవరూ అంటే చంద్రబాబు అని జగన్ చెప్పారు.
చంద్రబాబు సైతం ఎన్నికల వేళ తాను మారాను అని ప్రజలను నమ్మించి మళ్ళీ వచ్చి అబద్ధాలు ఎన్నో చెబుతున్నారని.. ఆయన్ను నమ్మవద్దని జగన్ కోరారు. మొత్తానికి జగన్ ప్రజలకు కథలు చెబుతూ చంద్రబాబు మీద బాగానే వ్యతిరేకత పోగేస్తున్నారని అంటున్నారు.
A Cunning Tiger Story Narrated by HCM Sri @YSJagan