YS Sharmila : షర్మిలకు బెయిలొచ్చింది.. కానీ చిన్న ట్విస్ట్

YS Sharmila విధాత‌: పోలీసులపై దాడి చేశారు.. కొట్టారనే ఆరోపణలతో హైదరాబాద్‌లో నిన్న అరెస్ట్ అయిన వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila)కు కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సోమవారం అరెస్ట్ అయిన షర్మిలను చంచల్ గూడ జైలుకు తరలించారు. మంగళవారం విచారణ జరిపిన కోర్టు షర్మిలకు విదేశాలకు వెళ్తే మాత్రం తమ అనుమతి తీసుకోవాలన్న షరతులతో బెయిల్ ఇచ్చింది. దీంతో బాటు రూ.30వేల పూచీకత్తు విధించింది. #WATCH | YSRTP Chief […]

  • Publish Date - April 25, 2023 / 02:10 PM IST

YS Sharmila

విధాత‌: పోలీసులపై దాడి చేశారు.. కొట్టారనే ఆరోపణలతో హైదరాబాద్‌లో నిన్న అరెస్ట్ అయిన వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila)కు కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సోమవారం అరెస్ట్ అయిన షర్మిలను చంచల్ గూడ జైలుకు తరలించారు.

మంగళవారం విచారణ జరిపిన కోర్టు షర్మిలకు విదేశాలకు వెళ్తే మాత్రం తమ అనుమతి తీసుకోవాలన్న షరతులతో బెయిల్ ఇచ్చింది. దీంతో బాటు రూ.30వేల పూచీకత్తు విధించింది.

పోలీసులపై చేయి చేసుకున్న కేసులో సోమవారం షర్మిలను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు బుక్ చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరచ‌గా.. కోర్టు రెండువారాల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆమెను చంచల్ గూడ జైలుకు తరలించారు. మంగళవారం ఆమెకు కోర్టు బెయిల్ ఇస్తూ విదేశాలకు వెళ్లితే తమ అనుమతి తీసుకోవాలని నిబంధన విధించింది.

పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీపై దర్యాప్తు చేస్తున్న సిట్ ఆఫీస్ కు షర్మిల వెళతారని సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఓ మహిళా కానిస్టేబుల్ ను షర్మిల నెట్టేసి, ఇంకో మహిళా కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నారు. దీంతో ఆమెను అరెస్ట్ చేశారు.